Sunday, 22 August 2021

Jr Ntr: కాజ‌ల్‌ చాలా స్పెషల్.. బాబోయ్ మా రిలేషన్ బయటపెడితే దిష్టి తగులుతుంది!! రామ్ చరణ్ ఓపెన్

హోస్ట్‌గా ‘’ కార్యక్రమం షురూ అయింది. హిందీలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన కౌన్ బ‌నేగా కార్య‌క్ర‌మాన్ని తెలుగులో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు పేరుతో ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమోస్ ఆసక్తిని పెంచేశాయి. ఇక నిన్న (ఆగ‌స్ట్ 22) ప్రారంభమైన తొలి ఎపిసోడ్‌తో హాట్ సీట్‌పై తన కో- యాక్టర్ రామ్ చరణ్‌ని కూర్చోబెట్టి సరదాగా అన్ని సీక్రెట్స్ రాబట్టారు ఎన్టీఆర్. చెర్రీ సైతం పలు ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు. షో మొదలుపెట్టిన తారక్ షో మొదట్లోనే షో రూల్స్ మొత్తం రామ్ చరణ్‌కి వివరించారు. ఆ తర్వాత తన స్నేహితుడిపై పలు ప్రశ్నలు సంధిస్తూ చాలా విషయాలు బయట పెట్టించారు. ఈ మేరకు తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని, అలాగే తమ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనే విషయాన్ని చెర్రీ రివీల్ చేశారు. తమ అనుబంధాన్ని బ‌య‌ట‌పెడితే దిష్టి త‌గులుతుందేమో అనేంతగా పవన్‌ బాబాయ్‌తో రిలేషన్ ఉందని అన్నారు. ''నాన్న నాతో డైరెక్ట్‌గా చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను బాబాయ్ ద్వారా మాకు చెప్పించేవారు. ఆయ‌న నాకో సోద‌రుడు, బాబాయ్‌, చిన్న తండ్రి'' అని అన్నారు. అలాగే చిరంజీవితో 'ఆచార్య' సినిమా షూటింగ్ అనుభవాలు చెప్పమని ఎన్టీఆర్ అడగడంతో రామ్ చరణ్ తన ఫీలింగ్స్ చెప్పారు. సాధార‌ణంగానే నాన్న సినిమా షూటింగ్స్‌కి వెళ్లిన‌ప్పుడు తాను ఫుల్ టెన్ష‌న్ ప‌డ‌తానని, అలాంటిది ఆయ‌న‌తో ‘ఆచార్య’ చేస్తున్న‌ప్పుడు చాలా కంగారు పడ్డానని చెప్పారు. నాన్నగారితో షూటింగ్‌కి వెళ్లడం అంటే ప్రిన్సిపల్‌తో కూర్చుని పరీక్షలు రాస్తున్నట్లు అంటూ రామ్ చరణ్ చమత్కరించారు. తన జీవితంలోనే కాకుండా తన కుటుంబం మొత్తానికీ ‘ఆచార్య’ ఎంతో స్పెష‌ల్‌ అని, నాన్న‌తో క‌లిసి స్క్రీన్ పంచుకోవ‌డాన్ని జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనని ఆయన అన్నారు. ఇకపోతే తాను పెంచుతున్న రెండు గుర్రాల గురించి కూడా ప్రస్తావించారు రామ్ చరణ్. 'మగధీర' సినిమాలో రెండు గుర్రాలను చూపించామని.. అందులో మగ గుర్రం పేరు బాద్షా అయితే ఆడ గుర్రం పేరు కాజల్ అని చెప్పారు. తన స్నేహితుడు చనిపోయే ముందు ఈ కాజల్ అనే గుర్రాన్ని తనకిచ్చాడని, అది చాలా చాలా స్పెషల్ అని, దాని క‌ళ్లు చాలా న‌ల్ల‌గా, షార్ప్‌గా ఉంటాయని చెప్పిన రామ్ చరణ్.. ఆ తర్వాత మగధీర సినిమా చేస్తే అందులో హీరోయిన్ కూడా కాజల్ కావడంతో కాస్త ఇబ్బందిగా అనిపించిందని నవ్వుతూ ఓపెన్ అయ్యారు. ఎన్టీఆర్ చేసిన ‘అదుర్స్’ సినిమా తనకెంతో ఇష్టమని, ఆ సినిమాను ఎన్నోసార్లు చూసి బాగా నవ్వుకున్నానని రామ్ చరణ్ అన్నారు. ఇప్ప‌టికీ నాకు ఎప్పుడైనా డ‌ల్‌గా అనిపిస్తే వెంట‌నే అదే సినిమా చూసి రిలాక్స్ అవుతుంటానని ఆయన తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zb8aLq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...