రాఘవ లారెన్స్ రూపొందించిన '' సినిమాలో నటించిన యువ నటి, రష్యన్ యువతి ఆత్మహత్యకు పాల్పడిందనే న్యూస్ తెలిసి అంతా షాకవుతున్నారు. గోవాలో ఆమె బస చేసిన హోటల్ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుండటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆమెది ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఆమె సన్నిహితులు, స్థానికుల సమాచారం మేరకు అలెగ్జాండ్రా జావి ప్రేమలో విఫలమైందని, కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయి డిప్రెషన్‌లో ఉందని తెలుస్తోంది. అదే డిప్రెషన్‌లో ఒత్తిడి తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందని అంటున్నారు. అంతకుముందు 2019 సంవత్సరంలో చెన్నై ఫోటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతని వల్ల ఏమైనా చనిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 24 ఏళ్ల వయసులో ఆమె అనుమానాస్పదంగా మృతి చెందడం కలచివేస్తోంది. అలెగ్జాండ్రా మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులకు చేరవేశారు. కాంచన 3లో పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించింది అలెగ్జాండ్రా జావి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wda5QY
v
No comments:
Post a Comment