Saturday, 21 August 2021

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రదీప్ గుహా కన్నుమూతతో శోకసంద్రంలో సెలబ్రిటీలు

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి సినిమా ప్రముఖులు కొందరు ఆ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఇతర అనారోగ్యంగా కారణంగా తుది శ్వాస విడుస్తున్నారు. వరుస విషాదాలతో ఇండస్ట్రీ తరచూ శోక సంద్రంలోనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌లో మరో దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, మూవీ మెఘల్ ప్రదీప్ గుహా(60) ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ఆయనకు శుక్రవారం వెంటిలేటర్‌పై చికిత్సఅందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 9ఎక్స్‌ మీడియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నా ప్రదీప్‌ గుహ గ్రూప్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. అంతేకాదు జీ నెట్‌వర్క్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ నటించిన 'ఫిజా' , మిథున్-డింపుల్ కపాడియా జంటగా 'ఫిర్ కభీ' చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపై బాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు సంతాపం తెలిపారు. మనోజ్ బాజ్‌పేయ్, నటి దియా మీర్జా, లారా దత్తా.. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడంలో ప్రదీప్ ఎప్పుడూ ముందు ఉంటారు అంటూ వాళ్లు పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3877haA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...