Monday 30 August 2021

సాయి బాబా విగ్రహం నుంచి విబూది!.. ఇంట్లో జరిగిన అద్భుతంపై హిమజ

విగ్రహం పాలు తాగిందని, విగ్రహం నుంచి నీళ్లు కారుతున్నాయని, సాయి బాబా చిత్రపటం నుంచి విబూది రాలుతోందని, విగ్రహం నుంచి విబూది రాలుతుందనే వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. వీటిని కొంత మంది నమ్ముతారు. ఇంకొంత మంది నమ్మరు. దేవుడిపై నమ్మకం ఉన్న వారు అలాంటి విషయాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఇంట్లో జరిగిన ఓ అద్భుతం గురించి చెప్పుకొచ్చారు. ఇది తాను ఎవ్వరినో నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేయడం లేదని, తన ఫీలింగ్‌ను చెప్పుకునేందుకు మాత్రమే వీడియో చేస్తున్నానని హిమజ తెలిపారు. హిమజ ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్ మీద శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ వైపు బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మరో వైపు భారీ ప్రాజెక్ట్‌లో చాన్సులు కొట్టేస్తున్నారు. హరిహర వీరమల్లు, వరుడు కావలెను వంటి చిత్రాల్లో హిమజ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా యూట్యూబ్‌లో నిత్యం వెరైటీ వీడియోలను పెడుతూనే ఉంటారు. తాజాగా హిమజ తన ఇంట్లో జరిగిన అద్భుతం గురించి చెప్పారు. తమ ఇంట్లో సాయి బాబా విగ్రహం ఉందని, తానే చిన్నప్పుడు దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశానని హిమజ తెలిపారు. ఓ స్వామిజీ చెప్పడంతో 19 రోజులు హోమం చేశామని హిమజ అన్నారు. ఇదంతా కూడా 2004లో జరిగిందని చెప్పుకొచ్చారు. అలా 19 రోజులు నిత్యం పూజలు చేయడంతో.. ఇంట్లో అదే కంటిన్యూ అయిందని అన్నారు. రోజూ పూజలు చేస్తూ వచ్చామని, ఆ రోజు తన డ్యూటీ వచ్చిందని చెప్పుకొచ్చారు. ‘సాయి బాబా విగ్రహాన్ని తుడవడం, ముందున్న నీళ్లను మార్చడం వంటివి ఆరోజు నేను చేయాలన్న మాట. అయితే నేను వెళ్లే సరికి సాయి బాబా విగ్రహం నుంచి విబూది వస్తూనే ఉంది. ముందు ఉంచిన నీళ్లలో తులసి వాసన వస్తోంది. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాం. ఇంకా పూజలు చేశాం. ఈ విషయాలన్నీ కూడా మీరు నమ్మడానికి చెప్పడం లేదు. స్వతాహగా అనుభవం అయితేనే ఎవ్వరైనా నమ్ముతారు. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంటూ హిమజ తన గతంలో జరిగిన ఈ అద్బుతం గురించి చెప్పుకొచ్చారు. వీడియో కోసం..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mLG9H0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...