Sunday, 11 July 2021

Rama Rao On Duty : RT 68 First Look : అదరగొట్టేసిన మాస్ మహారాజా!

మాస్ మహారాజా ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. క్రాక్ ఇచ్చిన బూస్టప్‌తో రెట్టింపు స్పీడులో దూసుకుపోతోన్నారు. ఓ వైపు ఖిలాడీ సినిమాను రెడీ చేశారు. మరో వైపు ఇంకో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. RT68గా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. షూటింగ్ లొకేషన్‌లో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న సీన్లకు సంబంధించిన ఫోటోలు బయట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇక నిన్న వదిలిన అప్డేట్‌తో మాస్ మహారాజా ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. అంటూ చిత్రయూనిట్ అప్డేట్ ఇవ్వడంతో ట్విట్టర్‌లో రవితేజ ఫ్యాన్స్ హల్చల్ చేశారు. దెబ్బకు నేషనల్ వైడ్‌గా రవితేజ, RT 68లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. నేటి ఉదయం పది గంటలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను వదులుతున్నామని మేకర్స్ ప్రకటించడం ఆలస్యం వెంటనే ట్విట్టర్‌లో వైరల్ అయింది. అయితే మేకర్స్ చెప్పినట్టుగానే సమయానికి అప్డేట్ వదిలారు. రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నాడని తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ అదరగొట్టేశాడు. తాజాగా వదిలిన టైటిల్ అండ్ ఫ్టస్ లుక్ దుమ్ములేపుతోంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ మూవీని శరత్ తెరకెక్కిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఈ చిత్రం రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hWjm7m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...