Tuesday, 13 July 2021

గోవా బీచ్‌లో యంగ్ హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ.. ఒంటిపై నూలుపోగు లేకుండా రౌడీ స్టార్ చిల్!!

టాలీవుడ్ రౌడీ స్టార్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా నేటితరం హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఆయన, అనతికాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకున్నారు. యువతను అట్రాక్ట్ చేసే క్యారెక్టర్స్ చేస్తూ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ బుట్టలో వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ పెంచుకొని క్రేజీ హీరో అయ్యారు విజయ్. సాధారణ ప్రజలే కాదు యంగ్ హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు. ''పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం'' లాంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు విజయ్. సెలబ్రిటీలందరితో చలాకీగా ఉండటం ఆయన నైజం. ముఖ్యంగా హీరోయిన్స్‌తో చాలా స్నేహంగా మెదులుతుంటారాయన. పార్టీలు, పబ్స్ అంటూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే విజయ్ దేవరకొండపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు యంగ్ హీరోయిన్స్. ఇప్పటికే ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి అందాల భామలు విజయ్ దేవరకొండ తమ ఫేవరేట్ హీరో అని చెప్పగా.. ఆ లిస్టులో మరో బాలీవుడ్ బ్యూటీ కూడా చేరిపోయింది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండపై తన ఇష్టాన్ని తెలిపింది కియారా. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరూ కలిసి దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో కియారా గ్లామర్ లుక్‌లో కనిపిస్తుండగా.. విజయ్ దేవరకొండ మాత్రం ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించారు. ఈ పిక్ గోవా బీచ్‌లో దిగిందని తెలుస్తోంది. ఇది చూసి సూపర్, సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఛార్మి నిర్మాణ సారథ్యంలో ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wwHanj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...