Sunday, 18 July 2021

మాస్ పాటకి ‘అక్సా’ గ్యాంగ్‌తో డ్యాన్స్ అదరగొట్టిన జాన్వీ కపూర్

స్టార్ కిడ్స్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొందరు వెంటనే సక్సెస్‌ని అందుకుంటారు. కొందరికి మాత్రం ఏంత బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వెలుగులోకి రాలేకపోతారు. అంతేకాదు.. అసలు మీరు ఇండస్ట్రీలో ఉంటానికి బ్యాక్‌గ్రౌండ్ తప్ప ఏం అర్హత ఉన్నది అంటూ విమర్శలు కూడా ఎదురుకుంటుంటారు. అలాంటి లిస్ట్‌లో ముందుండే వ్యక్తి హీరోయిన్ . అతిలోక సుందరి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆరంగేట్రం చేసిన ఆమె ఇప్పటివరకూ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘దఢక్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటివరకూ సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య జాన్వీ నటించి.. ఓటీటీలో విడుదలైన ‘గుంజన్ సక్సేనా’ ఫర్వాలేదు అనిపించింది. ఇది మినహాయించి ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. అయితే ఈ భామ సోషల్‌మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తరచూ విహార యాత్రలకు వెళుతూ.. అక్కడ హాట్ డ్రెస్‌లు ధరించి ఆమె ఫోటోలు పోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఆమె ఫోటోషూట్ పిక్స్‌ కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా జాన్వీ ఓ మాస్ మసాలా డ్యాన్స్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. సూపర్ హిట్ పాట ‘’కు తన గ్యాంగ్‌తో కలిసి ఆమె చిందులు వేసింది. తన గ్యాంగ్‌కి ‘అక్సా’ గ్యాంగ్ అంటూ ఆమె పేరు పెట్టింది. ఇది లో బడ్జెట్ సీక్వెల్ అంటూ ఆమె పేర్కొంది. సరైనా లోకేషన్ లేకపోయినా.. ప్రొపర్టీలు లేకపోయినా.. అక్సా గ్యాంగ్ డ్యాన్స్ అదరగొట్టింది అంటూ జాన్వీ తెలిపింది. ‘మీ డ్యాన్స్ అదిరిపోయిందంటూ’ కీర్తీ సురేష్, రకుల్ ప్రీత్, అర్జున్ కపూర్ తదితర సెలబ్రిటీలతో పాటు.. అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘తక్త్’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kreJVD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...