Sunday, 18 July 2021

వీకెండ్ పార్టీ.. అంతా కలిసి పేకాడేశారుగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ హల్చల్

ఎక్కువగా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తన కుటుంబ సభ్యులు ఎలా గడుపుతుంటారు.. ఎలా ఎంజాయ్ చేస్తుంటారో చెబుతుంటారు. గత లాక్డౌన్ సమయంలో అయితే తన కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో ఎంత సందడిచేశారో నిత్యం అప్డేట్ ఇస్తూనే వచ్చారు. అందరూ కలిసి పేకాట ఆడుతూ కనిపించారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేసి వీకెండ్‌ను ఎలా గడిపారో చూపించారు. ఇప్పుడు కూడా వరలక్ష్మీ అదే మాదిరిగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మామూలుగా అయితే వరలక్ష్మీ ఇప్పుడు హైద్రాబాద్‌లో ఉండాల్సింది. సందీప్ కిషన్ మూవీ కోసం గత ఏడాది హైద్రాబాద్‌కు వచ్చారు. ఇక శరత్ కుమార్ సైతం ఆ మూవీ సెట్‌ను సందర్శించారు. చిత్రయూనిట్‌తో కలిసి కాసేపు ముచ్చటించారు. అయితే వరలక్ష్మీ మాత్రం ఈ వీకెండ్‌కు చైన్నకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎలా ఎంజాయ్ చేశారో చూపించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పేకాట ఆడుతున్న దృశ్యాలను షేర్ చేశారు. ఇక తండ్రి శరత్ కుమార్, సోదరిని ఏడిపిస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. అందరూ కలిసి తినడం, ఎంజాయ్ చేయడం గురించి చెప్పుకొచ్చారు. ఇక సెల్ఫీలతో వరలక్ష్మీ శరత్ కుమార్ హల్చల్ చేశారు. ఈ ఏడాది వరలక్ష్మీకి బాగానే కలిసి వచ్చింది. క్రాక్, నాంది వంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BgGYvZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...