Sunday, 11 July 2021

కత్తి మహేష్ మరణంపై శేఖర్ కమ్ముల పోస్ట్.. ఓ రేంజ్‌లో నెటిజన్ల అటాక్ .. ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తూ!

ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ కత్తి మహేష్. బ్రతికుండగా ఎంతలా జనంలో నోళ్ళలో నానుతూ చర్చల్లో నిలిచారో చనిపోయాక కూడా ఆయన విషయంలో అదే కంటిన్యూ అవుతోంది. గత రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ నిన్న (జులై 10) ఆయన తుది శ్వాస విడిచారు. అయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయగా.. ఓ వర్గం వాళ్ళు.. ఆయన మాత్రం మరణాంతరం కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం చూస్తున్నాం. అయితే ఈ రచ్చ నడుస్తుండగానే మరణంపై పెట్టిన పోస్ట్ మరింత రచ్చ క్రియేట్ చేసింది. హిట్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కత్తి మహేష్ మృతిపై రియాక్ట్ అయ్యారు. కత్తి మహేష్ మరణం తీరని లోటు అని పేర్కొన్న ఆయన, ఆ లోటును పూడ్చడం చాలా కష్టమని అన్నారు. ఆయన శాస్త్రీయ దృక్పథం ఉన్న నిజమైన పోరాట యోధుడు అని తెలుపుతూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు శేఖర్ కమ్ముల. దీంతో ఈ ట్వీట్ చూసి కొంతమంది నెటిజన్స్ ఆయనపై అటాక్ షురూ చేశారు. ఈ విషయమై శేఖర్ కమ్ములను ట్రోల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ శేఖర్ కమ్ములపై విరిచుకుపడుతున్నారు నెటిజన్స్. కత్తి మహేష్ మరణంపై మీ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు. శ్రీరాముల వారిని సీతమ్మ తల్లిని కత్తి మహేష్ దూషిస్తున్నపుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? ప్రగాఢ సానుభూతి తెలిపేంత మంచి మనసు ఉన్నపుడు, దూషిస్తున్నపుడు మీ మనసు ఎందుకో స్పందించలేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ''సినీ పరిశ్రమలో కొందరు ఎలాంటి వివాదాలకు పోకుండా వారి గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. మీరు ఆ లిస్ట్ నుండి పోకుండా చూసుకోండి'' నిన్న జస్వంత్ రెడ్డి అని ఒక జవాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అతను కాదు ట్రూ ఫైటర్, కానీ మీ లాంటి మతోన్మాదులకి ఒకరు దైవంగా భావించే రాముడిని దూషించే కత్తి మహేష్ లాంటి వ్యక్తి ట్రూ ఫైటర్ అంటూ శేఖర్ కమ్ముల ఓ రేంజ్‌లో అటాక్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wuKHTb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...