Wednesday, 21 July 2021

పెళ్లయ్యాక లైఫ్ మారిపోయింది.. కాస్త బాధగా అనిపించింది కానీ! దగ్గుబాటి రానా ఓపెన్

కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ రూటులో వెళ్తూ అందరు హీరోల్లో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నారు రానా. దగ్గుబాటి వారసుడిగా వెండితెరపై విలక్షణ పాత్రలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్న ఆయన తాజాగా మరో అడుగేశారు. భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ దగ్గర నుంచి రెజ్లింగ్‌, టోక్యో 2021, ఒలంపిక్స్‌ దాకా జరిగే అన్ని అప్‌డేట్స్‌ని తెలుగులో పరిచయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రముఖ ఛానల్‌ సోనీ టీవీతో రానా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన రానా తన వ్యక్తిగత విషయాలతో పాటు తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. తెలుగు లోతుగా నేర్చుకుంటే అందులోని మాధుర్యం తెలుస్తుందని అన్నారు. 'నారప్ప' సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం చాలా బాధగా అనిపించిందని చెప్పిన ఆయన, పెళ్లి తర్వాత జీవితంలో చాలా మార్పులొచ్చాయని తెలిపారు. మరింత ఫోకస్‌గా సినిమాలపై దృష్టి పెట్టానని, త్వరలోనే బాబాయ్‌ వెంకటేష్‌, తమ్ముడు అభిరామ్‌లతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పారు. ఇకపోతే RRR సినిమాలో రామ్‌ చరణ్‌ టీజర్‌ బాగా నచ్చిందని ఆయన చెప్పడం విశేషం. రానా ప్రధాన పాత్రలో రూపొందిన 'విరాటపర్వం' మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. దీంతోపాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్‌లో భాగమవుతున్నారు రానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kJ2QdI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...