Tuesday, 13 July 2021

ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూశారు.. కత్తిమహేష్ జీవితంలో మిగిలిన అసంతృప్తి ఇదే

ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో ఒక విషాదం నుంచి కోలుకొనే లోపే మరో విషాదం చోటు చేసుకోవడం తీరని శోకాన్ని నింపుతున్నాయి. కొందరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు ప్రమాదాల కారణంగా.. అంతేకాక వయోభారాల కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. తాజా ప్రముఖ విమర్శకుడు, దర్శకుడు, నటుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఆయన మృతికి తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు. ఒక కొన్ని వివాదాల రూపంలో కూడా ఆయన లైమ్‌లైట్‌లోకి వచ్చారు. కొందరు స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తూ.. ఆయన ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాక.. సదరు హీరోల అభిమానులు టార్గెట్ చేయడం ఆయన ప్రభుత్వం నుంచి జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం సోషల్‌మీడియా ద్వారా ఆయన కొన్ని పోస్టులతో హల్‌చల్‌ చేశారు. అయితే కత్తి మహేశ్ తన జీవితంలో రెండు కోరికలు తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. అదేంటంటే.. కత్తి మహేష్ ఒక నటుడిగా మంచి గుర్తింపు సాధించాలని భావించారట. అంతేకాదు.. రాజకీయాల్లో ఆయన అడుగుపెట్టాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కోరికలు తీరకుండానే కత్తి మహేశ్ మరణించడం ఆయన అభిమానులను తీవ్ర బాధలోకి నెట్టేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ వాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B6FlBl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...