Monday, 19 July 2021

అలాంటి పనులు చేయకండి.. మెగా డాటర్‌కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్!

మెగా డాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్నారు. పెళ్లి అయిన తరువాత మరింత ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. నిహారిక షేర్ చేసే ఫోటోలు, పోస్ట్‌లు, భర్తను ఆట పట్టిస్తూ వేస్తే సెటైర్లు వైరల్ అవుతుంటాయి. ఇక తన పెట్‌ బజ్‌కు సంబంధించిన విశేషాలు సైతం అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. పెళ్లి తరువాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ మునుపటి కంటే బిజీగా షూటింగ్‌లతో గడిపేస్తున్నారు. గత వారం పాండిచ్చెరిలో గడిపి వచ్చిన ఈ కొత్త జంట.. వెంటనే వెనుదిరిగి వచ్చేసింది. అక్కడ నిహారిక చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. పూర్తిగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చేశారు.ఇక అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకున్నారు. అతడు సినిమాలో త్రిష టైపులో పార్దు చూసి చెప్పు అని కౌంటర్ కూడా వేశారు. అలా అక్కడి నుంచి వచ్చిన వెంటనే నిహారిక మళ్లీ తన షూటింగ్‌లతో బిజీ అయ్యారు. షూటింగ్‌కు సంబంధించిన ప్రతీ రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు. సెట్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ చేసే అల్లరి గురించి ఏదో ఒకటి చెబుతుంటారు. అయితే తాజాగా నిహారికకు డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. లుక్ రివీల్ చేయకుండా ఫోటోలు ఎలా అయిన దిగండి.. ఏమైనా చేసుకోండని అన్నాడట. దీంతో నిహారిక తన చున్నీని అడ్డం పెట్టుకుని ఫోటోలు దిగి షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wOF6HD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...