Wednesday, 21 July 2021

ఆ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన ధనుష్.. నెక్ట్స్ మూవీలో ఓ డిఫరెంట్ రోల్‌లో..

కోలీవుడ్ స్టార్ హీరో పాపులారిటీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే ధనుష్ దుమ్ములేపనున్నారు. కథ, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్‌ హిట్‌లను కొట్టేస్తున్నారు.ఇంత వరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించారు. త్వరలో నేరుగా టాలీవుడ్‌లోకి ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ధనుష్ త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా సినిమాకు వేరియేషన్ చూపించడంలో ధనుష్ ఎప్పుడు ముందుటారు. ఒక సినిమాలో ఊర మాస్ పాత్రలో కనిపిస్తే.. ఆ తర్వాతి సినిమాలో దానికి పూర్తి వ్యతిరేకంగా క్లాస్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఇది చాలాకాలంగా జరుగుతున్న విషయమే. కొన్ని రోజుల క్రితం ‘జగమే తందిరం’ అనే సినిమాతో ధనష్ ప్రేక్షకులను పలకరించారు. లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మిశ్రమ స్పందన లభించింది. దీని తర్వాత ధనుష్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చేయనున్నారు. తన కెరీర్‌లో 43వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో ‘పేట’, ‘మాస్టర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్, మాళవిక ఇరువురు జర్నలిస్టులుగా నటిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యే హాలీవుడ్‌లో ‘గ్రే మ్యాన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొని వచ్చిన ధనుష్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kGhCSx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...