Wednesday, 21 July 2021

నా కులం అదే.. నెటిజన్‌‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బ్రహ్మాజీ.. ఆ సంఘపోడికి మాటల్లేవ్

‘కులం పునాదులపై ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేము’ అని విఖ్యాతుడైన డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌‌ ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు భారతీయ రాజకీయాలను శాసించేదే కులం. మావాడు.. మాకులం.. అనే ప్రస్తావన లేకుండా పంచాయితీ బోర్డ్ మెంబర్‌ని కూడా ఎన్నుకునే పరిస్థితి లేదంటే రాజకీయాలు ఎలా తగలడ్డాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కులరక్కసి కేవలం రాజకీయాల్లోనే కాదు.. అన్ని రంగాల్లోనూ నాటుకుని పోయింది. ఇక సినిమా రంగాన్ని కూడా శాసించేది ఈ కులమే. ఇప్పటికే కొన్ని కులాల చేతిలో సినిమా ఇండస్ట్రీ ఉందని.. ప్రత్యక్ష పరోక్ష విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మా కులపు హీరో.. మా కులపు నిర్మాత.. మా కులపు దర్శకుడు.. అనే ముద్ర ఇండస్ట్రీలో ఉండనే ఉంది. ప్రతిభను బట్టి కాకుండా కులాన్ని బట్టి అభిమానాన్ని ఏర్పరచుకోవడం ఏళ్లకి ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కులపిచ్చిని పెంచిపోషించే వాళ్లు కొందరు ఉంటే.. ఛల్ రే ఛల్ కులమూ లేదు గిలమూ లేదు.. ఐ యామ్ ఇండియన్ అంటూ ఓ కులపిచ్చ అభిమానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు నటుడు . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. తన ఫేస్ బుక్‌లో నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్లకు రిప్లైలు ఇస్తుంటారు. వాటిలో మంచి టైమింగ్ పంచ్‌లు కూడా ఉంటాయి. తాజాగా ఓ నెటిజన్.. ‘అన్నా నేను మన కమ్యునిటీకి చెందిన వాడని.. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరని మిక్కిలి కోరుకుంటున్నాను’ అంటూ బ్రహ్మాజీ ప్రొఫైల్ ఫొటోకింద కామెంట్ పెట్టాడు. అయితే ఆ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు బ్రహ్మాజీ. ‘నేను ఇండియన్‌ని.. తెలుగోడిని.. అదే నా కమ్యునిటీ’ అంటూ రిప్లై ఇచ్చారు. అవకాశం కావాలంటే అడగాలి కానీ.. కులం గిలం ఏంట్రా.. అయినా బ్రహ్మాజీ గారు అదిరిపోయే రిప్లై ఇచ్చి వాడి నోరు మూయించారని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇంతకీ మీది ఏ కులం అని కొంతమంది కామెంట్స్ చేయడం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ixCMQf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...