Monday 28 June 2021

MAAలో గొడవలకు ముఖ్య కారణం అదే.. గత విషయాలు తవ్వుతూ జీవిత షాకింగ్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ()లో లుకలుకలు.. ఈ మాట వినడం కొత్తేమీ కాదు. ఎన్నోసార్లు పతాక శీర్షికల్లో ఈ హెడ్‌లైన్ చూశాం. ఇందుకు ప్రధాన కారణం 'మా' వర్గాల్లో విభేదాలు రావడమే. ఇకపోతే ప్రతి ఎన్నికల సమయంలో ఒక వర్గంపై మరో వర్గం మాటల తూటాలతో రాజకీయ వేడిని తలపిస్తున్నాయి మా ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు తమ పోటీని కన్ఫర్మ్ చేశారు. సీనియర్ నటి రాజశేఖర్ కూడా బరిలో ఉన్నట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే వర్గ పోరు మొదలైనట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు 'మా' కార్మికులకు అండగా నిలుస్తానని హామీ ఇస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ ఇప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభించడంపై తన అసంతృత్తి తెలియ జేశారు. ప్రకాష్ రాజ్ వర్సెస్ వీకే నరేష్ ఎపిసోడ్స్ అనంతరం జీవిత రాజశేఖర్ కూడా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. అసోసియేషన్‌లో గొడవలకు ముఖ్య కారణం ఈగోలేనని చెప్పిన జీవిత.. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని అన్నారు. గతంలో రాజశేఖర్ రాజీనామా చేసినప్పుడు 'మా' వర్గాలు వ్యవహరించిన తీరు తనకు ఏ మాత్రం నచ్చలేదంటూ అప్పటి విషయాలను తవ్వారు. రాజశేఖర్ రాజీనామా చేశాక తాను కూడా తన ఆఫీస్ బేరర్ పదవికి రాజీనామా చేయాలనుకున్నానని, కానీ రాజశేఖర్ సర్ధి చెప్పారని అన్నారు. రాజశేఖర్ విషయంలో జరిగిన సంఘటనలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని, ఆ విషయాలు నేటికీ మర్చిపోలేకపోతున్నానని ఆమె తెలిపారు. 950 మంది సభ్యులున్న మా అసోసియేషన్ లో 350 మంది మహిళలు ఉన్నారని, ఈ సారి ఓ మహిళను అధ్యక్షురాలిని చేస్తానని పెద్దలు అన్నారని.. దానికి సమయం వచ్చిందని ఆమె చెప్పారు. ఈ కామెంట్స్ చూసి 'మా' అధ్యక్ష పీఠంపై జీవిత తన ఇంట్రెస్ట్ వెల్లడించిందనే టాక్ మొదలైంది. ఏదేమైనా ఈ సారి 'మా' ఎలక్షన్స్ గతంలో కంటే మరింత రసవత్తరంగా సాగుతాయని మాత్రం స్పష్టమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dgZ4Uv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...