Sunday, 18 April 2021

పసిపాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావా?.. స్టార్ హీరోపై ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్

ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని ఘటనలు అందరినీ ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ నెగెటివిటీయే కాకుండా కొన్ని హాస్యాస్పద ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఎంతో సున్నితమైన హ్యాసాన్ని అందిస్తూ..ఎంతో హ్యూమరస్‌గా కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిపై సెలెబ్రిటీలు చేసే కామెంట్లు కూడా అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోపై చేసిన కామెంట్లు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. క‌ృతి సనన్ ప్రస్తుతం భేడియా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం అరుణా చల్ ప్రదేశ్‌లొ ఉంది. అయితే అక్కడ తమ యూనిట్‌లోని సహ నటుడి కూతురు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. ఇందులోనే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బర్త్ డే చిన్న పాపది కావడంతో వరుణ్ ధావన్ కేక్ కట్ చేశాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కట్ చేసిన కేక్ ముక్కను పాపకు పెట్టకుండా ఆమె తండ్రికి పెట్టేశాడు. దీంతో ఎంతో ఆశగా ఆత్రుతగా ఎదురుచూసిన ఆ చిన్నారి షాక్ అయింది. చిత్రవిచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేసింది. అలా కేక్ ముక్కను తనకు పెట్టలేదని ఆ పాప చూసిన చూపులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అదే విషయాన్ని క‌ృతి సనన్ చెబుతూ.. ఈ వీడియో మిమ్మల్ని ఈ రోజంతా ఆనందంగా ఉండేలా చేస్తుంది కాబోలు.. ఇలాంటి ఘటన అందరికీ జరిగి ఉండొచ్చు కదా?..అయినా పసి పాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావ్ అని అనుకోలేదు అంటూ వరుణ్ ధావన్ మీద సెటైర్ వేశారు. ప్రస్తుతం కృతి సనన్ షేర్ చేసిన వీడియో, చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆ పసిపాపకు ఎదురైన ఘటనే తనకు కూడా ఎదురైందని.. తనను కూడా ఎన్నో సార్లు అలా ఏడిపించాడని, తనకు కూడా అలానే చేశాడని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కృతి సనన్ ప్రస్తుతం హీరోగా వస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటించబోతోందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mVTJWa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...