Monday, 12 April 2021

తగ్గేదే లే..! విరాట్ కోహ్లిని అలా చూడగానే అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్.. సినీ, క్రీడాభిమానులు ఫిదా

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని చూసి స్టైలిష్ స్టార్ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. అరె! వీళ్లిద్దరికీ లింక్ ఏంటి? ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ, బన్నీ మ్యాటర్ తెరపైకి వచ్చిందేంటి అనే డౌట్ వస్తోంది కదూ.. అక్కడికే వద్దాం. అల్లు అర్జున్ సినిమాలన్నా, స్టైలిష్ డాన్సులన్నా దేశ విదేశాల్లో ఎంత క్రేజ్ ఉంటుందనేది ఇటీవలే విడుదలైన 'అల.. వైకుంఠపురములో' సినిమా రుజువు చేసింది. ఇక ఇప్పుడు ఆయన లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ 'పుష్ప' కూడా అదే రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా పుష్పరాజ్ రూపంలో కనిపించడంతో బన్నీ క్రేజీగా రియాక్ట్ అయ్యారు. ఐపీఎల్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోహ్లీ RCB జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆల్ రౌండ్ ప్రతిభతో ఈ టీమ్ మెప్పించింది. దీంతో స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్ వారు ట్విటర్‌ వేదికగా విరాట్‌ కోహ్లిని ఫొటోను గెటప్ లోకి మార్చేసి 'తగ్గేదే లే' అంటూ జనాల్లోకి వదిలారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ''తగ్గేదే.. లే.. ఆరంభం అదిరింది. ఓటమి సరిహద్దుల దాకా వెళ్ళి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడారు. సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు. కోహ్లీ మంత్ర ఫలించింది మొదటి మ్యాచ్లో RCB గెలిచేసింది'' అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. అయితే పుష్పరాజ్ లుక్‌లో ఉన్న విరాట్ కోహ్లీని చూసి నవ్వుతున్న ఎమోజీతో పాటు, థంబ్స్‌అప్‌ సింబల్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు బన్నీ. ఇక సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ ఉదంతం అంతా చూసి దేశవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడాభిమానులు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఈ రకంగా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా 'పుష్ప'కు భారీ ప్రమోషనయితే దక్కిందని చెప్పుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e08Ael
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...