Friday, 12 March 2021

మిహీకాని పెళ్లి చేసుకుంటానంటే మా ఇంట్లో వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు కానీ చైతూ.: రానా దగ్గుబాటి

ఈ లాక్ డౌన్‌లో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి.. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసి తన నెచ్చెలి మిహీకాను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే తాను మిహీకాను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్తే ఎవరూ నమ్మలేదంటూ నాటి విషయాన్ని పంచుకున్నాడు రానా. తాజాగా దగ్గబాటి రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారి సీజన్ 3 మార్చి 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘ఆహా’ (ఓటీటీ)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రానా.. ఈ షోకి సంబంధించే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. మిహీకాతో పెళ్లి గురించి ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారని ఆర్జే హేమంత్ అడగడంతో.. ‘మా పేరెంట్స్‌తో కలిపిచెప్పొచ్చా’ అని తెగ నవ్వుకున్నారు రానా. ఫస్ట్ మా అమ్మకి చెప్పాను.. మిహీకాను పెళ్లి చేసుకుంటా అని.. ఆమె నన్ను సీరియస్‌గా తీసుకోలేదు.. లాక్ డౌన్‌లో వచ్చి పెళ్లి అంటున్నాడేంటి అనుకుంది. సర్లే నాన్నతో మాట్లాడు అని చెప్పింది. ఆ తరువాత నాన్నకి కూడా చెప్పాను. ఆయన కూడా షాక్ అయ్యారు. నిజమా కాదా అని అనుకున్నారు. కానీ ఆ తరువాత నాగ చైతన్యతో చెప్పాను.. తను కూడా మా ఫ్యామిలీ సభ్యుడే కావడంతో అతనితో చెప్పాను. అతను మాత్రం భలే రియాక్ట్ అయ్యాడు. వీడియో కాల్‌లో బెస్ట్ దా.. బెస్ట్ డెసిషన్ అన్నాడు.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు’ అని చెప్పుకొచ్చారు హీరో రానా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tgTcQr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...