Friday, 12 March 2021

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి ఆంటీ వీడియో.. ఈసారి ఇలా షాకిచ్చింది

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను దున్నేయడమే పనిగా పెట్టుకుని చెలరేగుతోంది సీనియర్ . అత్త, తల్లి, అక్క పాత్రలతో టాలీవుడ్‌లో ఆంటీగా పేరొందిన ఈమె సోషల్ మీడియాలో యమా యాక్టివ్. లాక్ డౌన్ తరువాత ఈమె మేకోవర్ మొత్తం మారిపోయింది. హాట్ హాట్ వర్కవుట్స్ వీడియోలు, డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిక్కెస్తుంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌ మంత్రాన్ని జపిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఆ మధ్య 'బొంబాయి' సినిమాలోని ''హమ్మ.. హమ్మ'' పాటకు డాన్స్ చేసి పరేషాన్ చేసేసింది. ఆ తరువాత విజయ్ ‘మాస్టర్’ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. నడుముని గింగిరాలు తిప్పుతూ వయ్యారాలు ఒలకబోస్తూ వరుస వీడియోలు వదిలింది. సినిమాల్లో మాత్రం చాలా పద్దతిగా కట్టు బొట్టుతో ఆకట్టుకునే ప్రగతి ఆంటీ.. లాక్ డౌన్ తరువాత తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఫిట్‌నెస్‌పై ఫుల్లుగా ఫోకస్ పెట్టిన ప్రగతి.. వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. లేటు వయసులో కూడా ఘాటైన అందాలతో మాస్ స్టెప్పులు వేస్తూ తన ఫాలోవర్స్‌ని రంజింపజేస్తుంది. దీంతో ఈ సీనియర్ భామకు నెట్టింట ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అయితే ఇవన్నీ ఒకలెక్క ఇది మరోలెక్క అన్నట్టుగా వీడియో విడుదల చేసింది ప్రగతి. ఈసారి ఏకంగా బుల్లెట్ ఎక్కి.. బైక్‌ని రై రై అంటూ డ్రైవ్ చేసి షాకిచ్చింది. చీరతో బుల్లెట్ ఎక్కి.. ఏమాత్రం కంగారు పడకుండా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుగానే బుల్లెట్ డ్రైవ్ చేసింది ప్రగతి. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పాతదే కాగా.. ఫ్రెష్‌గా మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రగతి. లాక్ డౌన్ టైంలో ఈ వీడియో బయటకు రాగా.. అప్పట్లో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OoTtlM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...