Thursday, 11 March 2021

కార్తికేయకు సూపర్ ఆఫర్.. 'ఉప్పెన' లాంటి మరో ఫీల్ గుడ్ మూవీ ప్లాన్ చేసిన సుకుమార్

క్రియేటివ్ డైరెక్టర్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే శిష్యులను ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సినిమాలు రూపొందిస్తున్నారు. మొదట కుమార్ 21F తో మంచి క్రేజ్ అందుకున్న సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌.. ఇటీవలే ఫీల్ గుడ్ మూవీ 'ఉప్పెన' ప్రేక్షకుల ముందుకు తెచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అదే ఫార్ములా రిపీట్ అయ్యేలా యంగ్ హీరో కార్తికేయతో కొత్త సినిమా ప్లాన్ చేశారు సుక్కు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు. సుకుమార్ నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో హీరోగా నటిచబోతున్నట్లు ప్రకటించిన సుక్కు.. త్వ‌ర‌లో మిగితా కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. కార్తికేయ అప్‌క‌మింగ్ మూవీ 'చావు క‌బురు చ‌ల్ల‌గా' చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్‌కి ఇంప్ర‌స్ అయిన సుకుమార్.. తన సొంత బ్యాన‌ర్‌పై ఓ సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. న‌వంబ‌ర్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు, త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు తొలిసినిమా Rx 100తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ వరుస సినిమాలతో విజయాలందుకుంటున్నారు. ఈ క్రమంలో సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ సినిమా అనే సరికి జనాల్లో ఆసక్తి మొదలైంది. ఇప్పటికే 'ఉప్పెన'తో తన శిష్యుడు బుచ్చిబాబును డైరెక్టర్‌గా పరిచయం చేసిన సుక్కు.. ఈ మూవీతో మరో శిష్యుడిని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qDF7uP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...