Thursday, 11 March 2021

ప్రమాదం విషయం తెలిసి ఎంతోమంది ఫోన్ చేశారు.. డబుల్ ఎనర్జీతో మీ ముందుకొస్తా: నిఖిల్

యంగ్ హీరో తన కొత్త సినిమా '' షూటింగ్‌లో గాయపడ్డారు. గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా నిఖిల్ ఎడ‌మ కాలుకు గాయమైంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నారు నిఖిల్. అయితే ఆయన నిఖిల్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ గాయం గురించి తాజాగా స్పందించారు నిఖిల్. హ్యాండ్ స్టిక్‌తో నిల్చున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ తన ఆరోగ్యం కోసం, తన కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తనకు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే చాలామంది తనకు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని, మరికొందరు మెసేజ్‌లు చేస్తున్నారని పేర్కొన్న ఆయన, మెల్లమెల్లగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని అన్నారు. త్వరలోనే డబుల్ ఎనర్జీతో మీ ముందుకొస్తానని నిఖిల్ పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా రూపొంది సక్సెస్ సాధించిన ‘కార్తికేయ’ మ్యాజిక్ మరోసారి రిపీట్ కాబోతోంది. కార్తికేయ సీక్వల్‌గా కార్తికేయ 2 సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కాస్త ఆలస్యం అయిన ఈ చిత్రాన్ని అతిత్వరలో ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qAx8yN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...