Thursday 29 October 2020

ఆ లెటర్ ఫేక్.. నా ఆరోగ్యం గురించి చెప్పింది మాత్రం నిజమే: రజినీకాంత్

తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల తాను రాజకీయాల్లోకి రాకపోవచ్చని తెలియజేస్తూ సూపర్ స్టార్ స్వయంగా రాసిన లేఖ ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లేఖ నిన్న పెద్ద దుమారమే రేపింది. దీనిపై రజినీ ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. అయితే, ఈ లేఖపై గురువారం రజినీకాంత్ స్వయంగా స్పందించారు. ఈ లేఖలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఒక ప్రకటన ఉంచారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆ లేఖ ఫేక్ అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని రజినీ వెల్లడించారు. ‘‘నేను ప్రకటించినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో, ప్రెస్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది నా ప్రకటన కాదని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. అయితే, నా ఆరోగ్యం గురించి.. డాక్టర్లు నాకు ఇచ్చిన సలహాల గురించి పేర్కొన్న విషయాలన్నీ నిజమే. నా రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు నేనే స్వయంగా చెబుతాను. నా రజినీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో చర్చించిన తరవాత సరైన సమయంలో ఈ ప్రకటన చేస్తాను’’ అని రజినీకాంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. ‘‘నా జీవితం గురించి నేను భయపడటం లేదు. ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని నేను ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సంగ్రామంతో చురుకుగా పాల్గొంటాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం క్షీణించినట్లయితే దాని వల్ల కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలోనూ నేను రాజకీయాల్లోకి రావాల్సి వస్తే జనవరి 15 కంటే ముందే రాజకీయ పార్టీని నేను ప్రారంభిస్తాను. అంతేకాదు, నా నిర్ణయాన్ని డిసెంబర్‌లో తెలియజేస్తాను. పార్టీని నా అభిమానులకు వదిలిపెడతాను. అప్పటి పరిస్థితుల ఆధారంగా నేను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి. ప్రజల తీర్పు అంటే ఆ దేవుడి తీర్పు. జై హింద్’’ అని ఆ ఫేక్ లెటర్‌లో రాసుంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరిగింది. వీటిని నిజం చేస్తూ 2017 డిసెంబర్‌లో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో సమావేశం ఏర్పాటుచేసి తన పొలిటికల్ ఎంట్రీ గురించి రజినీకాంత్ ప్రకటించారు. ఆ సమయంలో రజినీ ప్రకటనపై విపరీతమైన చర్చ జరిగింది. రజినీ నిర్ణయాన్ని స్వీకరించినవారూ ఉన్నారు.. వ్యతిరేకించిన వాళ్లూ ఉన్నారు. అయితే, రజినీకాంత్ ప్రకటన చేసి మూడేళ్లు గడుస్తున్నా రాజకీయ పార్టీని స్థాపించడంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే, ఆయన ఫ్యాన్ క్లబ్ రజినీ మక్కల్ మండ్రమ్ (RMM) రాజకీయ సంస్థగా మారిపోయింది. ఒకవేళ తన పార్టీ 2021 ఎన్నికల్లో పోటీ చేసినా తాను మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనని రజినీకాంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HNl5Nz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...