Friday 30 October 2020

వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా? 7 నిమిషాల వర్కవుట్స్.. పూరి పాఠం వినాల్సిందే!

ఎప్పటిలాగే మరో పోడ్ కాస్ట్ ఆడియోతో మనముందుకొచ్చారు. ఈ ఆడియోలో నీకొచ్చే అవకాశాలను ఎలా పసిగట్టాలో తెలుపుతూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. పూరి చెప్పిన ఈ మోటివేషనల్ పాఠం వింటే.. ''బుద్ధుడు చెప్పాడు.. వన్ డే కెన్ చేంజ్ లైఫ్.. అవకాశం అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది తెలియదు. చాలా సార్లు అసలు అవి మనకోసం వచ్చిన సువర్ణావకాశాలు అని మనకే తెలియదు. తెలియాలంటే లైఫ్‌లో చాలా అలర్ట్‌గా ఉండాలి. కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి తలుపులు బాదుతూ అరుస్తున్నా వినిపించదు. పందుల్లా నిద్రపోతారు నా కొడుకులు. నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడికి చాలా టాలెంట్‌ ఉంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా అని అతడో పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకుని తూచ తప్పకుండా పాటిస్తున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. Also Read: నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లోడివి అని ఎవరైనా అంటే నమ్మకండి. ఇక్కడ ఎవరికీ సమయం లేదు. కళ్లు మూసి తెరిచేలోపు అందరికీ 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మిమ్మల్నేవరూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించరు. నీ విలువ అవతలి వాడికి తెలిసినప్పుడే నువ్వు బిజీ అవుతావు. ప్రారంభంలో అందరూ నిన్ను వాడతారు. వాడనీయ్.. అలా వాడుతున్నారంటే వాళ్లకు నువ్వు పనికొస్తున్నావని అర్థం. అన్నీ నేర్చుకో. అందరూ అలా వాడుతున్నప్పుడే నువ్వు అలర్ట్‌గా ఉండు. అన్నీ వాళ్లే నేర్పిస్తారు. నీ టైం బాగుంటే ఇలాంటి వారంతా ముందే ఎదురవుతారు. మరేం పర్లేదు వాళ్లే నిన్ను మార్చేస్తారు. రోజులో ఎదోఒకటి నేర్చుకోకుండా పడుకోవద్దు. ఎప్పుడూ ఫైర్‌తో ఉండు ఎలాంటి కడుపు నొప్పి ఉండదు. కసిగా ఉండు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. మూడు పూటలా కలిపి ఎన్ని నిమిషాలు తింటే అంతసేపు వ్యాయామం చేయ్‌. జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 7 నిమిషాల వర్కవుట్ కోసం యాప్‌లు కూడా ఉన్నాయి. అన్ని అవకాశాలు నీ ముందే ఉంటాయి.. నువ్వు అలర్ట్‌గా ఉంటే వాటిని వాడుకోవచ్చు. లేదంటే నీ కళ్ల ముందే అలా అలా డాన్స్ ఆడుతూ వెళ్లిపోతాయి'' అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oEAP6x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...