Monday 31 August 2020

139 People Rape Case: అందుకే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితురాలు

ఏకంగా 139 మంది ఒక్కసారి కాదు రెండు సార్లు తనపై 5000 సార్లు అత్యాచారం చేశారని 25 ఏళ్ల దళిత యువతి ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె గత 10 రోజుల క్రితం ఈ విషయాన్ని బయటపెడుతూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదు అందించడంతో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు , నటుడు కృష్ణుడు ఉండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కరే కాకుండా గ్యాంగ్ రేప్‌లు కూడా చేశారని, గర్భం దాల్చితే అబార్షన్స్ చేయించారని.. అలాగే ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని యువతి ఇచ్చిన ఫిర్యాదుపై 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ పరిస్థితుల్లో సదరు యువతి మాట మారుస్తూ ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కి గానీ, నటుడు కృష్ణుడుకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బాధితురాలు మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. Also Read: రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ప్రెషర్ మూలంగానే తాను 139 మంది పేర్లతో ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. ఇందులో కొందరికి సంబంధం లేదని చెప్పినా కూడా వినకుండా తనను ఫిజికల్‌గా, మెంటల్‌గా టార్చర్ పెట్టి బెదిరింపులకు పాల్పడి తనతో ఈ కంప్లైంట్ పెట్టించాడని తెలిపింది. ఆయన చెప్పిన గైడెన్స్‌తోనే ఇప్పటిదాకా మీడియా ముందు మాట్లాడానని చెప్పుకొచ్చింది. తనపై రేప్ జరిగిన మాట వాస్తవమే గానీ కొందరిని అన్యాయంగా బలి చేశాడని, తనను కొట్టి అందరి పేర్లు పెట్టించాడని బాధితురాలు తెలిపింది. ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ సారీ చెబుతున్నానని చెప్పింది. డాలర్ బాయ్ మూలంగా కేసు తప్పుదోవ పట్టిందని, అతని ఒత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరు, నటుడు కృష్ణుడు పేరు చెప్పానని తెలిపింది. సెలబ్రిటీల నుంచి డబ్బులు గుంజడానికి డాలర్ బాయ్ ఈ కుట్ర పన్నాడని పేర్కొంది. తనపై 139 మంది రేప్ చేయలేదని.. డాలర్ బాయ్ తనను, తన కుటుంబాన్ని బెదిరించి అలా కేసు పెట్టించాడని బాధితురాలు చెప్పింది. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31HYNEz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...