Sunday, 19 July 2020

Trisha Krishnan: మోగనున్న త్రిష పెళ్లి బాజాలు.. ఆ వివాదాస్పద హీరోతో ఫిక్స్! సైలెంట్‌గా అంతా రెడీ..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ లిస్టులో పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 37 ఏళ్ల వయసొచ్చినా వన్నెతరగని అందంతో సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. గతంలో ఓ సారి పెళ్లి పీటలెక్కే అవకాశం వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మాత వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకొని, తీరా పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకున్న త్రిష, ఆ తరువాత కొన్నేళ్ల పాటు పెళ్లి మ్యాటర్ పక్కన బెట్టేసింది. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఓ స్టార్ హీరోతో ఫిక్స్ అయిందని తెలుస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీని గత 18 ఏళ్లుగా ఏలుతూ తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన త్రిష.. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించేసింది. దీంతో ఆమె దృష్టి పెళ్లిపై పడిందని, అందుకే సినిమాలు తక్కువగా చేస్తోందనే టాక్ ముదిరింది. ఈ క్రమంలో ఆమె కనిపించిన ప్రతి ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్న ఎదుర్కొనేది త్రిష. అయితే అన్ని సందర్భాల్లో ఆమె చెప్పింది ఒక్కటే.. ''నచ్చిన మగాడు దొరికితే లాస్‌వేగాస్‌లోనే పెళ్లి చేసుకుంటా'' అని. ఈ నేపథ్యంలో త్రిష కోరుకున్నట్లుగా ఓ మగాడు ఆమెకు తెగ నచ్చేశాడని, అతనెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో అనే వార్తలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read: తమిళ సినీ వర్గాలు, మీడియా కథనాల సమాచారం మేరకు హీరో శింబుతో త్రిష పెళ్లి ఖాయమైనట్లు తెలుస్తోంది. కాగా.. హీరో శింబు గతంలో హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలు అందరికీ తెలిసినవే. మొదట నయనతారతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ హీరో.. ఆ తర్వాత హన్సికతో ప్రేమాయణం సాగించి విఫలమయ్యాడు. అయితే ఇంత జరిగిందని తెలిసినా గత కొన్ని రోజులుగా త్రిష- శింబుతో ప్రేమలో ఉందని, వీరి పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ముహూర్తం పెట్టుకునే ఆలోచనలో పడ్డారని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. త్రిష- శింబు జోడీగా 'విన్నైతాండి వరువాయ' ( ఏమాయ చేశామే తమిళ్‌ వెర్షన్ ‌), అలై చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విన్నైతాండి వరువాయ సీక్వెల్‌లో మరోసారి ఈ ఇద్దరూ జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది. సో.. చూడాలి మరి త్రిష- శింబు పెళ్లి వార్తలపై ఆ ఇద్దరిలో ఎవ్వరైనా స్పందిస్తారా? లేదా ఆ వార్తలను నిజం చేస్తారా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WxDumc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...