Sunday, 19 July 2020

Taapsee Pannu: బాలీవుడ్ మాఫియాపై చర్చలు.. హీరోయిన్ల మధ్య ముదిరిన వార్.. కంగనాకు తాప్సి స్ట్రాంగ్ కౌంటర్

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ మాఫియాపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇండస్ట్రీ కేవలం కొందరు పెద్దల చేతుల్లోనే ఉందని, నెపోటిజం కారణంగా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ జీవితం ఇలా గుగ్గిపాలవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాప్సిపై కొన్ని కామెంట్స్ చేయడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. బాలీవుడ్ మాఫియాలో తాప్సి కూడా భాగమవుతానందనే కోణంలో కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ని టార్గెట్ చేసింది కంగనా. బాలీవుడ్‌లో పెద్ద మాఫియా నడుస్తోందని, కరణ్ లాంటి బడా నిర్మాతల చెప్పుచేతుల్లో కొందరు హీరోయిన్స్ ఉన్నారని ఇటీవల జరిగిన పలు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. ఇలాంటి వాళ్లకు కూడా తాప్సి, స్వర భాస్కర్ లాంటి వారు మద్దతు పలికి బాలీవుడ్ మాఫియాను ఎంకరేజ్ చేస్తున్నారంటూ వివాదాన్ని పెద్దది చేసింది. అంతేకాదు బాలీవుడ్ మాఫియా కారణంగా వాళ్లిద్దరూ బి గ్రేడ్ యాక్టర్స్‌గా మిగిలిపోయారంటూ కంగనా విరుచుకుపడింది. Also Read: దీంతో ఈ వివాదంలోకి ఎంటరై తాజాగా కంగనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది . ''నాకు తెలిసి కేవలం 10,12 తరగతుల్లోనే గ్రేడ్స్ ఇచ్చేవారు. అదే గ్రేడ్ సిస్టమ్ కెరీర్ లోనూ అఫిషియల్‌గా కొనసాగిస్తున్నారా?'' అంటూ సెటైరికల్ కౌంటర్ వేసింది తాప్సి. అంతేకాదు తానెప్పుడూ కరణ్ జోహార్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదని, అలాగని ఆయన్ను తిట్టాల్సిన అవసరం కూడా తనకు లేదని తాప్సి పేర్కొంది. దీంతో కంగనా- తాప్సి మధ్య వార్‌లో మరో స్టెప్ పడినట్లయింది. సో.. చూడాలి మరి తాప్సి కౌంటర్‌పై కంగనా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jkt9nk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...