Monday, 20 July 2020

RRR సినిమాపై వర్మ ట్వీట్ ... రాజమౌళిపై సెటైర్లు కూడా

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పై విమర్శలు చేశాడు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా రాజమౌళిపై సెటైర్లు కూడా వేశారు. కరోనా కాలంలో అన్ని సినిమా షూటింగులు ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి సినిమాల ఆలస్యంపై రామ్ గోపాల్ వర్మ చురకలంటిస్తూ ట్వీట్ పెట్టాడు. ‘హే రాజమౌళి ప్రపంచమంత ఆన్లైన్లోకి మారిపోయింది… అదే ప్రస్తుతం సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్… ప్రస్తుతం ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి.. మేమంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బులు ఇచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ కామెంట్ పై రాజమౌళి ఎలా స్పందిస్తారు. అసలు స్పందిస్తారో లేదో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే వర్మ తన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రూ. 25 చెల్లించి చూడాలని విడుదల చేసిన సంగతి తెలిసిందే. Read More: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి జంటగా నటిస్తోన్న చిత్రం RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టిస్టారర్ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా నటిస్తున్నారు. మెగా, ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. చలన చిత్ర పరిశ్రమ సైతం ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో తారక్ లుక్ కోసం ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళికి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CtCaKm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...