Monday, 20 July 2020

Ram Gopal Varma: మరో స్టార్‌ హీరోపై కన్నేసిన వర్మ.. ఈ సారి టార్గెట్ ఆయనే! ఆ రాత్రి ఏం జ‌రిగిందంటే..

కరోనా కల్లోల సమయంలో తన రూటే సపరేటు అన్నట్లుగా వరుసపెట్టి సంచలనాలు సృష్టిస్తున్న .. తన తదుపరి సినిమా కోసం మరో బడా స్టార్‌కి సూటి పెట్టారని తెలుస్తోంది. ప్రెజెంట్ ట్రెండ్ క్యాచ్ చేసుకుంటూ అడల్ట్, పొలిటికల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ సారి టాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేశారనే సమాచారం వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా స్టార్ ప్రొడ్యూస‌ర్‌లు, స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులంతా కెమెరాలన్నీ స్విచ్చాఫ్ చేసుకొని ఇంటికే పరిమితం కాగా, ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో దూకుడుగా వెళ్తున్నారు. ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. జనం నోళ్ళలో నానే అంశాలు, సంచలనం సృష్టించిన నిజ జీవిత సంఘటనలు, అడల్ట్ కిక్కిచ్చే కథలు ఇవే వర్మ ఎంచుకుంటున్న సబ్జెక్టులు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌`, శ్రీ రాపాక‌తో `నేక్డ్‌`( న‌గ్నం) సినిమాలను రిలీజ్ చేసి లాభాలు గడించారు వర్మ. ఇక ఇప్పుడేమో 'పవర్ స్టార్' పేరుతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి ''ఎన్నిక తర్వాత కథ'' అనే ట్యాగ్ లైన్‌తో ఓ సినిమా, 'మర్డర్' పేరుతో ప్రణయ్ హత్యోదంతంపై మరో సినిమా చేస్తూ వివాదాల్లో ముందు వరుసలో ఉన్నారు. Also Read: ఇకపోతే తన సినిమాలను తానే ప్రమోట్ చేసుకుంటూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌ర్మ.. తాజాగా మ‌రో హీరో నంద‌మూరి బాల‌కృష్ణను టార్గెట్ చేసిన‌ట్టు తెలిసింది. కొన్నేళ్ల క్రితం ఇంట్లో కాల్పులు చోటు చేసుకోవడం, ఆ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కథగా తీసుకొని త‌న ఓటీటీ కోసం సినిమా చేయ‌బోతున్నార‌ట‌ వర్మ. `ఆ రాత్రి ఏం జ‌రిగిందంటే` అనే టైటిల్‌‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఇలా ఇంకెంతమంది హీరోలపై వర్మ కన్ను పడిందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DXJzlr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...