బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రి, దిగ్గజ రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కావ్యాన్ని పోలాండ్ దేశానికి చెందిన విద్యార్థులు ఆలపించడమే దీనికి కారణం. హరివంశ్ రాయ్ బచ్చన్ రచించిన ‘మధుశాల’ పుస్తకం చాలా ఫేమస్. ఈ పుస్తకంలోని ఒక కావ్యాన్ని పోలాండ్‌లోని వ్రోక్లోవ్ యూనివర్సిటీ విద్యార్థులు బృందగానం చేశారు. యూనివర్సిటీ భవంతిపైకి ఎక్కి ఎలాంటి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేకుండా ఎంతో మధురంగా ఈ కావ్యాన్ని పోలాండ్ విద్యార్థులు ఆలపించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి గురయ్యారు. తన కళ్లలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నారు. ‘‘నాకు కన్నీళ్లు ఆగలేదు! యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ అవార్డును సొంతం చేసుకున్న పోలాండ్‌లోని వ్రోక్లోవ్ నగరంలో యూనివర్సిటీ విద్యార్థులు ఆ యూనిర్సిటీ భవంతి పైకప్పుపై నిలబడి మా నాన్నగారి ‘మధుశాల’ కావ్యాన్ని ఆలపించారు. డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ నగరం వ్రోక్లోవ్ అనే సందేశాన్ని వారు చాటారు’’ అని అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమ్మాయిల బృందం ఎంతో మధురంగా ‘మధుశాల’ కావ్యాన్ని ఆలపించింది. కాస్త వెస్టరన్ టచ్ ఇస్తూ చేసిన ఆలాపన చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మాత్రమే కాదు.. మన జాతీయ గీతం ‘జనగణమన’ను కూడా ఈ బృందం ఆలపించింది. నిజానికి ఈ వీడియోను జూన్‌లోనే అప్‌లోడ్ చేశారు. అయితే, అమితాబ్ నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే, కిందటేడాది అమితాబ్.. వ్రోక్లోవ్ నగరానికి అంబాసిడర్‌గా నియమితులయ్యారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jo7v1A
v
No comments:
Post a Comment