జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ‘పవర్ స్టార్’ అనే సెటైరికల్ మూవీ తీస్తోన్న రామ్ గోపాల్ వర్మపై రివేంజ్ తీర్చుకునేందుకు పీకే ఫ్యాన్స్ ‘పరాన్నజీవి’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘పవర్ స్టార్’కు పోటీగా ఈ ‘పరాన్నజీవి’ని వదులుతున్నారు. ‘పవర్ స్టార్’ విడుదలవుతోన్న జూలై 25నే ‘పరాన్నజీవి’ కూడా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ‘పరాన్నజీవి’ సినిమాలో వివాదాస్పద నటి నటిస్తున్నారని ప్రస్తుతం వదంతులు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ విషయమై శ్రీరెడ్డి, వర్మ మధ్య జరిగిన రహస్య సంభాషణలు, ఒప్పందాల నేపథ్యంలో ‘పరాన్నజీవి’ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్‌లో షూటింగ్ జరుగుతోందని, మూడు రోజుల్లో షూటింగ్ పూర్తిచేయనున్నారని టాక్. Also Read: అయితే, పవన్ కళ్యాణ్‌పై రోజూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి ఆయనకు అనుకూలంగా తీసే సినిమాలో ఎందుకు నటిస్తారనే అనుమానం చాలా మందిలో ఉంది. అందుకే, ఈ విషయమై శ్రీరెడ్డిని ‘సమయం’ సంప్రదించింది. ‘పరాన్నజీవి’లో నటించమని తనను అడిగారని.. కానీ, ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్ చేశానని శ్రీరెడ్డి వెల్లడించారు. ‘ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ.. నేనెందుకు చేస్తాను’ అని సమాధానం ఇచ్చారు. అంటే, ‘పరాన్నజీవి’లో శ్రీరెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్న విషయం వాస్తవమే అనుకోవచ్చు. కాకపోతే, శ్రీరెడ్డి పాత్రలో మరో నటిని చూపించబోతున్నారేమో. మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద బురదజల్లడానికి వర్మ ఎలాంటి పనులు చేశారో ‘పరాన్నజీవి’లో చూపించబోతున్నట్టు స్పష్టమవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BkeozY
v
No comments:
Post a Comment