Wednesday, 22 July 2020

నితిన్, షాలిని నిశ్చితార్థం.. ఉంగరాలు మార్చుకున్న కొత్తజంట

కాబోయే వధూవరులు హీరో నితిన్, ఆయన ప్రేయసి ఉంగరాలు మార్చుకున్నారు. వీరి నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో ఈ నిశ్చితార్థ వేడుకను సింపుల్‌గా నిర్వహించారు. ఈ మేరకు తన నిశ్చితార్థ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో వధువు షాలినికి నితిన్ ఉంగరం తొడుగుతున్నారు. షాలిని సిగ్గుపడుతూ నవ్వుతున్నారు. ఈ ఫొటోలో కాబోయే వధూవరులు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. కాగా, నితిన్-షాలిని వివాహం ఈనెల 26న హైదరాబాద్‌లో జరగనుంది. రాత్రి 8.30 గంటలకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నితిన్-షాలిని పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ పెళ్లిని చాలా సింపుల్‌గా నిర్వహించనున్నారు. అయితే, ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఇటీవల నితిన్ స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌కు శుభలేఖ అందజేశారు. Also Read: ఇదిలా ఉంటే, నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలిని. నితిన్, షాలినీలది ఎనిమిదేళ్ల పరిచయం. షాలిని 2012లో నితిన్ కలిశారట. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకన్న తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న నితిన్‌, షాలినిల పసుపు, కుంకుమ వేడుక జరిగింది. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి తేదీలను నిర్ణయించారు. దుబాయ్‌లో వీరి వివాహం జరపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే కరోనా వైరస్ వల్ల కుదరలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jrDzSh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...