Sunday, 10 May 2020

నా సక్సెస్‌‌కి కారణం ఆమెనే.. రోజా ఎమోషనల్ కామెంట్స్.. అత్త అన్నపూర్ణను గుర్తుచేస్తూ అమల!!

ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మను మించిన ఐశ్వర్యం అంతకంటే లేదు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. తాను కడుపుమాడ్చుకొని కూడా బిడ్డ ఆకలి తీర్చే గుణం ఒక్క అమ్మకే సొంతం. అలాంటి తల్లి ప్రేమకు గుర్తుగా ప్రతీ ఏడాది మే నెల రెండవ ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా 'మదర్స్ డే' నిర్వహించుకుంటాం. నేడే (మే 10) ఆ పర్వదినం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మతో జ్ఞాపకాలను, తీపి గుర్తులను పంచుకుంటూ సోషల్ మీడియాలో ‘మదర్స్ డే’ విషెస్ చెబుతున్నారు పలువురు సెలబ్రిటీలు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు మదర్స్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేయగా, తాజాగా అక్కినేని నాగార్జున భార్య తన జీవితంలోని కొందరు స్త్రీమూర్తులను తల్లుల కంటే మిన్నగా పేర్కొంటూ మదర్స్ డే విషెస్ తెలిపారు. అంతేకాకుండా వారి ఫొటోలను కూడా పోస్టు చేశారు. తన తల్లి ఫొటో మాత్రమే కాకుండా అత్తగారైన అక్కినేని అన్నపూర్ణ గారి పిక్ కూడా ఆమె పోస్ట్ చేయడం విశేషం. అదేవిధంగా అమల పోస్టు చేసిన ఫొటోల్లో ఆమె సోదరి, మేనకోడలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అత్తగారు అన్నపూర్ణ తనకు తల్లి కంటే ఎక్కువ అని అన్నారు. ''ఐ మిస్ యూ అత్తమ్మా" అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. తల్లి గురించి చెబుతూ "మై బ్యూటిఫుల్ మామ్" అంటూ ట్వీట్ చేశారు అమల. అలాగే అమ్మ ప్రేమ లోని మాధుర్యాన్ని తెలుపుతూ అమ్మను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది నగరి ఎమ్మెల్యే, సినీ నటి . ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ''అమ్మ అంటే అందరికీ ప్రాణం. అమ్మ అనే పదమే అద్భుతం. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహం వల్లే సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో, ఓ తల్లిగా ఇంట్లో నేను సక్సెస్‌ అయ్యాను. మా అమ్మను చాలా మిస్‌ అవుతున్నాను. తల్లులందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు'' అని పేర్కొంది రోజా. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3blNun2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...