Sunday, 10 May 2020

మహేష్ బాబు డైలాగ్స్ చెప్పిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా

క్రికెట్ అభిమానులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో నెంబర్ వన్ బ్యాట్స్ మ్యాన్. ఇక ఐపీఎల్ టీమ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీంలో ఒకడు. ఆటలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో... సోషల్ మీడియాలో కూడా వార్నర్ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. అయితే వార్నర్ చేసిన తాజా పోస్టును చూసి ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆశ్చర్య పోతున్నారు. , పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’లో డైలాగ్స్ చెప్పాడు వార్నర్. 'పోకిరి' చిత్రంలోని సూపర్ హిట్ డైలాగ్ తో అదరగొట్టాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ ఫేమస్ డైలాగ్‌తో వీడియో చేశాడు వార్నర్ బ్యాట్ పట్టుకొని వార్నర్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. తనదైన స్టైల్‌లో తెలుగు డైలాగ్ చెప్పిన వార్నర్ "ఇది ఏ సినిమా డైలాగ్ కనుక్కొండి అంటూ అందరినీ అడుగుతూ ట్వీట్ చేశాడు. వార్నర్ చేసిన ట్వీట్ పై పోకిరి చిత్ర డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పందించారు. "డేవిడ్... ఈ డైలాగ్ నీకు సరిగ్గా సరిపోతుంది. మొండి పట్టుదల, దూకుడు కలగలిసిన వ్యక్తివి నీవు. నటుడిగానూ నువ్వు సూపరబ్బా. నా చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తావని అనుకుంటున్నా. లవ్ యూ వార్నర్" అంటూ రిప్లై ఇచ్చాడు పూరి. అయితే వార్నర్ చేసిన వీడియోలో చూసి అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వార్నర్‌కు టాలీవుడ్ అంటే ఇష్టం పెరుగుతందని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ హిట్ సాంగ్ 'బుట్టబొమ్మ' పాటకు టిక్ టాక్ వీడియోలో రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు వార్నర్. మొత్తం మీద లాక్ డౌన్ టైమ్‌లో వార్నర్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WEUKoQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...