Tuesday, 12 May 2020

బిగ్ సర్‌ప్రైజ్: పెళ్లిపీటలు ఎక్కుతోన్న రానా.. అమ్మాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో రానా దగ్గుబాటి ఒకరు. రానా డాషింగ్ లుక్స్, ఆయన నటనకు ఎంతో మంది అమ్మాయిలు ఫ్యాన్స్. రానా ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అనే ప్రశ్న లేకుండా ఉండదు. ఇంకొంత మంది అయితే కాస్త ముందుకు వెళ్లి ‘మీరు ఎవరుతో డేటింగ్‌లో ఉన్నారు?’ అని కూడా అడుగుతారు. ఇప్పుడు అలాంటి ప్రశ్నలన్నింటికీ పుల్‌స్టాప్ పడుతోంది. ఎందుకుంటే, రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన గర్ల్‌ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను తాను పెళ్లాడబోతున్నట్టు రానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. మిహీకాతో తీసుకున్న ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ‘ఆమె యస్ చెప్పింది’ అనే క్యాప్షన్‌ను ఈ ఫొటోకు పెట్టారు. అయితే, తమ పెళ్లి ఎప్పుడు?, ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు చేసుకుంటారు? వంటి విషయాలను మాత్రం రానా వెల్లడించలేదు. కేవలం తనకు పార్ట్‌నర్ దొరికిందని మాత్రమే స్పష్టం చేశారు. మిహీకా బజాజ్ డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో‌ను నడుపుతున్నారు. ఇదొక ఈవెంట్ కంపెనీ. గొప్పగొప్ప వాళ్ల ఇళ్లలో ఈవెంట్లను ఈ కంపెనీ డిజైన్ చేస్తూ ఉంటుంది. అయితే, ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈమెతో ఎంగేజ్‌మెంట్ గురించి రానా ప్రకటించడంతో అంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆఖరికి సినీ తారలు సైతం సర్‌ప్రైజ్ అయ్యి రానాకు అభినందనలు తెలుపుతున్నారు. సమంత, శృతిహాసన్, కియారా అద్వానీ, ఈషా రెబ్బా, ఉపాసన కొణిదెల, హన్సిక, స్వప్నా దత్, తమన్నా తదితరులు రానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zsuKVQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...