అమ్మ ప్రేమలోని మాధుర్యానికి గుర్తుగా ప్రతీ ఏడాది మే రెండవ ఆదివారాన్ని మాతృదినోత్సవం ()గా జరుపుకుంటారు. ఈ రోజున తల్లితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తల్లి ప్రేమ తాలూకు విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన తల్లితో తమకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లితో తీసుకున్న ఫోటోలను జత చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. జీవితంలో మనకు సంబంధించిన ప్రతి కథ వెనుక మన తల్లి కథ ఉంటుందని పేర్కొన్నారు చిరంజీవి. ఎందుకంటే అమ్మకు సంబంధించిన కథతోనే మనందరం జీవితం ప్రారంభింఆచమని అన్నారు. నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి ఫొటోతో పాటు తన భార్య నమ్రత ఫొటోను షేర్ చేస్తూ విలువైన సందేశం ఇచ్చారు. 'నా జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచింది వీళ్ళిద్దరిదే. అసాధారణ ప్రేమ కురిపిస్తున్న మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే' అని ఆయన పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SQwdMi
v
No comments:
Post a Comment