రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఈరోజు (మే 20న) సాయంత్రం జరగనున్నట్టు ప్రచారం జరిగింది. సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరనుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు చెప్పారు. ఈరోజు నిశ్చితార్థం జరగడం లేదని.. కేవలం పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి మిహీకా కుటుంబ సభ్యులు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారని సురేష్ బాబు తెలిపారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ఖరారు చేసుకుంటామని చెప్పారు. లాక్డౌన్ రానా పెళ్లికి ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకాదని సురేష్ బాబు స్పష్టం చేశారు. Also Read: ఇదిలా ఉంటే, రానా ఇటీవల తన ప్రేయసి మిహీకాను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి షాకిచ్చారు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో ఒకరిగా ఉన్నా రానా అకస్మాత్తుగా తన జీవిత భాగస్వామిని పరిచయం చేయడంతో ఆ అమ్మాయి ఎవరనే చర్చ అందరిలో మొదలైంది. హైదరాబాద్‌కే చెందిన ప్రముఖ ఈవెంట్ ప్లానర్. ఇంటీరియల్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన మిహీకా సొంతంగా ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. Also Read: మిహీకా తల్లి బంటీ బజాబ్ జ్యువెల్లరీ డిజైనర్. అంతేకాదు ఇండియాలోని టాప్ వెడ్డింగ్ డెకార్ ప్లానర్లలో ఒకరిగా బంటీ పేరుగాంచారు. కొన్నాళ్లు తల్లికి సహకారం అందించిన మిహీకా.. 2017లో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. మిహీకాకు సోదరుడు సమర్థ్ ఉన్నారు. ఆయన ప్రముఖ డిజైనర్ కునాల్ రావల్ సోదరి శాషాను వివాహం చేసుకున్నారు. మిహీకా తండ్రి పేరు సురేష్. వీరంతా ముంబైలో స్థిరపడ్డారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zXNXiA
v
No comments:
Post a Comment