Saturday 30 May 2020

Balakrishna: బాలయ్య రూ. 6 కోట్లు ఇచ్చి తన పేరు వద్దన్నారు, చిరంజీవితో వ్యవస్థ నిర్వీర్యం: నిర్మాత సంచలన కామెంట్స్

సినీ పెద్దల మీటింగ్ ఫిల్మ్ ఛాంబర్‌లో కాకుండా కొంతమంది వ్యక్తులతో ఇంట్లో జరపడంపై ఫైర్ అయ్యారు నిర్మాత ప్రసన్న కుమార్. గతంలో మీడియాతో సమస్య వచ్చినప్పుడు చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్దే నిరసన తెలిపారని ఆయన గుర్తు చేస్తూ చిరంజీవి నిర్వహించిన మీటింగ్‌ను తప్పు పట్టారు. ప్రసన్న కుమార్ మాట్టాడుతూ.. ‘ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంది.. కొన్ని తరాలుగా ఇక్కడే మీటింగ్‌లు జరుగుతున్నాయి. ఆరోజు పవన్ కళ్యాణ్‌కి సమస్య వచ్చినప్పుడు మీటింగ్ ఇంట్లో పెట్టుకోలేదు.. ఛాంబర్‌కే వచ్చారు.. ఆయన వెనుకు నాగబాబు ఇతర మెగా హీరోలంతా ఛాంబర్‌కే వచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆరోజు గుర్తుకు వచ్చి ఈరోజు పక్కనపెట్టి మీ ఇంట్లోనే చర్చలు జరుపుకుంటే ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు?? ఈరోజు చిరంజీవి, ఇండస్ట్రీకి రెండు కళ్లు. ఏ కన్నుని పక్కన పెట్టినా తప్పు. ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుని పోవాలి. ఈరోజు ఇండస్ట్రీలో క్రిష్ణ, క్రిష్ణంరాజు, మోహన్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్లందర్నీ కలుపుకుని పోవాలనే బాధ్యతని విస్మరించి ప్రైవేట్‌గా మీటింగ్‌లు పెట్టడం తప్పు. కరోనా క్రైసిస్ ఛారిటీ అని పెట్టారు.. దాన్ని ఛాంబర్ ద్వారా నిర్వహించవచ్చు. దానికి చిరంజీవి గారినే చైర్మన్‌‌గా పెట్టండి.. తప్పులేదు.. కాని అలా చేయలేదు. గతంలో కర్నూల్ వరదలు వచ్చినప్పుడు బాలయ్య బాబు ఇలాగే చేశారా?? ఆరోజు వరదలు వచ్చినప్పుడు బాలయ్య బాబే డబ్బులు వసూలు చేసి.. దాసరి నారాయణ రావు గారికి అందిస్తే.. ‘బాలయ్యా నువ్ కష్టపడుతున్నావ్.. నీ పేరు మీదే కానియ్యి’ అంటే.. ‘లేదు.. ఛాంబర్ ద్వారానే చేస్తా అని.. రోశయ్య గారికి రూ. 6 కోట్లు అందించడం జరిగింది. ఇదే కాదు.. దాదాసాహెబ్ ఫాల్కే, రామానాయుడు గారి ఫంక్షన్, చిరంజీవి గారి పద్మ భూషన్ కార్యక్రమం ఇలా ఏది చూసుకున్నా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షతనే జరిగింది. అలాంటి ఛాంబర్‌ని పక్కనపెట్టారు. అంతెందుకు మా ప్రెసిండెంట్ నరేష్ గారికి పిలుపు లేదు.. సెక్రటరీ జీవితా రాజశేఖర్‌కి పిలుపు లేదు. ఛాంబర్‌లో ఒక వ్యక్తిని పిలుస్తారు.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కౌన్సిల్‌లో ఒక వ్యక్తిని పిలుస్తారు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే మీరు సంస్థల్ని, వ్యవస్థల్ని, ఇండస్ట్రీని నిర్వీర్యం చేసి ప్రైవేటు ప్రాపర్టీగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చేయదల్చుకున్నారా?? ఇది ఖచ్చితంగా తప్పు.. ఇప్పటికైనా కళ్లు తెరిచి సంస్థలు, వ్యవస్థల ద్వారానే మీరు ఏ పని అయినా చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత ప్రసన్న కుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cicX16
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...