Wednesday 29 April 2020

మరణానికి కొన్నిక్షణాల ముందు ఇర్ఫాన్ ఏమన్నాడంటే.. గుండెలు పిండేసే మాటలు!!

బాలీవుడ్ నటుడు (53) మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో నెట్టేసింది. చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడిన ఆయన ఏప్రిల్ 29వ తేదీన ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ మరణ వార్త తెలిసి బాలీవుడ్‌లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సహా ఇతరభాషా నటీనటులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. అయితే మరణానికి కొన్నిక్షణాల ముందు ఇర్ఫాన్ మాట్లాడిన మాటలు మరింత కంటతడి పెట్టిస్తున్నాయి. కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకొచ్చిన ఇర్ఫాన్ ఖాన్‌కి తన తల్లి అంటే ఎంతో ప్రేమ ఉండేదట. అయితే మూడు రోజుల క్రితమే అంటే శనివారం (ఏప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మరణించడం ఆయన్ను మరింత కలిచి వేసిందని, రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన తన తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోవడం ఆయన జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు ఇర్ఫాన్ బంధువులు. లాక్‌డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూసి ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. గతంలో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) వ్యాధితో బాధపడిన ఆయన, తల్లి మరణం తర్వాత మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని, హాస్పిటల్‌లో చేరాక కూడా ఎక్కువగా తల్లినే గుర్తుచేసుకున్నారని చెప్పారు. ఇక చివరకు తన మరణానికి కొన్నిక్షణాల ముందు 'నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది' అని ఇర్ఫాన్ అనడం జీర్ణించుకోలేక పోయామని ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్న బంధువులు పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇర్ఫాన్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఆయన మరణించారనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతోంది ప్రేక్షకలోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SlUBVV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...