Tuesday 28 April 2020

43 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన రోజు ఇది.. ‘బాహుబలి’కి ముడిపెట్టిన దర్శకేంద్రుడు

తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి దర్శకేంద్రుడిగా టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. నటరత్న నందమూరి తారక రామారావుతో ఈయన 10కి పైగా సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 1977 ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’ విడుదలైంది. ఈ సందర్భాన్ని గుర్తిచేసుకుంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే, తాను సమర్పించిన ‘బాహుబలి 2’ కూడా ఏప్రిల్ 28నే విడుదలకావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. Also Read: ‘‘ఏప్రిల్ 28 నా సినీ జీవితంలో ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే అది చరిత్ర సృష్టించిన రోజు, 43 ఏళ్ల క్రితం అడవి రాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి అడవి రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఆ చిత్ర దర్శకుడిగా చట్టం ఆఫ్‌ ద షిప్‌‌గా.. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘‘అడవి రాముడు’’ రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని ఉదాహరణలు.. 4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌‌లో ప్రతిరోజూ 5 షోష్‌‌తో 100 రోజులు ఆడటం మరో విశేషం. బంగారానికి తావి అద్దినట్టు ఏప్రిల్‌ 28 నాడే నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండుగలని ఒకేరోజు అందించిన ఏప్రిల్‌ 28, కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ... అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీస్‌ విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలతో భారతదేశం భవ్య దేశంగా విరాజిల్లాలని కోరుకుంటూ.. మీ కె.రాఘవేంద్రరావు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eWX82A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...