Tuesday 28 April 2020

స్టార్ హీరో గొప్పమనసు.. మొత్తంగా 30 కోట్లు.. ఇదీ పోలీసుల రియాక్షన్

కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ సమయంలో మేమున్నాం అంటూ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సినీ తారలు. ఈ మహమ్మారిని కట్టడిలో చేయడంలో భాగమవుతూ ప్రభుత్వానికి ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. సీఎం, పీఎం సహాయనిధులకు తమకు తోచినంత సొమ్ము డొనేట్ చేస్తూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎందరో స్టార్స్ తమ వంతు సహకారం అందించగా, బాలీవుడ్ హీరో మాత్రం కోట్ల రూపాయలు సాయమందిస్తూ అందరి కృతజ్ఞతలు అందుకుంటున్నారు. కరోనా నివారణ చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఇదివరకే 25 కోట్ల భారీ విరాళాన్ని పీఎం సహాయనిధికి అందించిన అక్షయ్.. అంతటితో ఆగక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికుల శ్రమను, కరోనాపై చేసే పోరాటంలో వారి ఆవశ్యకతను గుర్తించిన ఆయన ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మరో 3 కోట్ల రూపాయల విరాళం అందించారు. తాజాగా పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం కూడా నడుం బిగించారు అక్షయ్. ఈ మేరకు ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు 2 కోట్ల రుపాయల విరాళం అందించారు. లాక్ డౌన్ పీరియడ్‌లో పోలీసులు చేస్తున్న సేవలు, విధి నిర్వహణలో భాగంగా కొందరు పోలీసులు కరోనా బారిన పడటం గుర్తించి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఈ 2 కోట్లు కేటాయించారు అక్షయ్. ఈ విషయమై రియాక్ట్ అయిన ముంబై పోలీస్ శాఖ.. అక్షయ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. టోటల్‌గా చూస్తే ఇప్పటిదాకా కరోనా కల్లోలంలో చిక్కుకుపోతున్న వారి సహాయార్థం అక్షయ్ కేటాయించిన మొత్తం 30 కోట్లు అయింది. ఒక హీరో ఇంత మొత్తం విరాళం అందించడం గ్రేట్ అంటూ అక్షయ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల కరోనా కేసులు నమోదుకాగా, ఇండియాలో 30 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరందరికీ వైద్యం అందిస్తూ ప్రభుత్వ వర్గాలు కఠోరంగా శ్రమిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Se2w7S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...