Tuesday 28 January 2020

వర్మ లాజిక్ బెడిసికొట్టింది.. గట్టిగా క్లాస్ పీకిన అధికారి

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓ అధికారి క్లాస్ పీకారు. మంగళవారం రాత్రి వర్మ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన ఇంటి పెరడులో ఉన్న జంతువులను గన్నుతో కాలుస్తున్న వీడియో అది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. వర్మ దేశ న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ‘ఓ అడవిలో జింకను చంపినందుకు సల్మాన్‌ని పోలీసులు, న్యాయస్థానాలు తరుముతున్నాయి. సల్మాన్‌కు వర్తించిన రూల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి వర్తించవా? అతను తన ఇంటి ముందు భాగంలో ఉన్న జంతువులనే గన్నుతో చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నప్పుడు నా ప్రశ్నకు పోలీసులు, న్యాయస్థానాలు సమాధానాలు చెప్పాలి. సల్మాన్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే.. అతను సెలబ్రిటీ అవ్వడం. అందుకే పోలీసులు ఆయన్ను శిక్షించాలని అనుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. READ ALSO: అయితే ఈ వీడియోను చూసిన పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి స్పందిస్తూ వర్మకు గట్టిగా క్లాస్ పీకారు. ఆ వీడియో ఇక్కడికి కాదని తెలిపారు. ‘మీరు ఈ ప్రశ్న బంగ్లాదేశ్ పోలీసులను అడగాలి. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన వీడియో ఇండియాలోది కాదు బంగ్లాదేశ్‌ది. కచ్చితంగా చెప్పలంటే చిట్టగాంగ్‌లోని వ్యక్తికి సంబంధించినది’ అని ఏకిపారేశారు. 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడారు. ఆ సమయంలో అతనితో పాటు సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, టబు కూడా ఉన్నారు. అయితే జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌ను దోషిగా తేల్చి మిగిలినవారిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. సల్మాన్‌కు ఏడేళ్లు కారాగార శిక్ష విధించింది. దాంతో రెండు రాత్రులు సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్‌ జైల్లో గడిపారు. ఆ తర్వాత ఆయన్ను బెయిల్‌పై విడిపించారు. అయితే తన కేసును మరోసారి పరిశీలించాలని సల్మాన్ జోధ్‌పూర్‌కు చెందిన సెషన్స్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు ఏ ఒక్క వాదనకు హాజరైంది లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37B2PiN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...