Thursday 29 August 2019

Saaho: శ్రద్ధా కపూర్.. ఇక్కడ హిట్టా ఫట్టా..!

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న సమయం ఆసన్నమైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ‘సాహో’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు కేటాయించి ప్రభాస్ నటించిన చిత్రమిది. పైగా ఇందులో హీరోయిన్ ఇక్కడి అమ్మాయి కాదు. భారీ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు అందులోని నటీనటుల స్థాయి కూడా అదే రేంజ్‌లో ఉండాలి. అందుకే జోరు మీదున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. అయితే తొలి తెలుగు సినిమా కావడంతో శ్రద్ధ కూడా తన స్థాయికి తగ్గట్టు పారితోషికం అడిగారు. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ రూ.6 కోట్లని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె అందంతో ఎక్కడి అభిమానులనైనా ఆకట్టుకోగలరు కానీ.. పరిచయం లేని భాషలో నటించి ప్రాంతీయ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడం అంత చిన్న విషయం కాదు. మొన్న విడుదలైన ట్రైలర్‌లో శ్రద్ధ నటన అభిమానులకు నచ్చిందనే అనిపిస్తోంది. అయితే సినిమా శ్రద్ధ వల్లే హిట్టవుతుందని చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ అక్కడ. అతన్ని డామినేట్ చేసేవారు సినిమాలో ఎవ్వరూ లేరు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే శ్రద్ధకు టాలీవుడ్‌లోనూ ఫ్యూచర్ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రెగ్యులర్‌గా విడుదల అవ్వవు. పైగా ‘సాహో’ సినిమా విజయం సాధించిందంటే.. శ్రద్ధ అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తారన్న సంగతి మన దర్శక, నిర్మాతలకు కూడా తెలుసు. కాబట్టి ఆమె విషయంలో ఇక్కడి వారు ఆచి తూచి వ్యవహరిస్తారు. ఒకవేళ శ్రద్ధ ఇక్కడ క్లిక్ అవ్వకపోయినా.. ఆమె నష్టపోయిదేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్ హీరోయిన్. పైగా అలనాటి నటుడు శక్తి కపూర్ గారాలపట్టి. ఏదేమైనా శ్రద్ధ మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అవ్వాలంటే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలి. ఎందుకంటే మన ప్రేక్షకులకు ఏది ఎప్పుడు నచ్చుతుందో తెలీదు. శ్రద్ధను తెలుగు ఆడియన్స్ స్వీకరిస్తారో లేదో రేపటితో తెలిసిపోతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdvTmp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...