Friday 26 July 2019

‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్.. బాక్సాఫీసు దుమ్ముదులుపుతోన్న ఉస్తాద్

‘‘శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’’ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వెండితెరను షేక్ చేస్తున్నారు. పక్కా హైదరాబాద్ స్టైల్లో తొలిసారి ఆయన తెలంగాణ యాసలో మాట్లాడుతూ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బాక్సాఫీసు దుమ్ముదులుపుతోంది. ఇన్నాళ్లూ హిట్టులేక ఢీలా పడిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాహాన్ని ఈ చిత్రం తీర్చింది. ఈనెల 19న విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తరవాత కూడా కలెక్షన్ల వేగం తగ్గలేదు. ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ట్వీట్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో రూ.61 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ‘బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్’ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. వాస్తవానికి ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఊరమాస్ సినిమా అంటూ విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. అయితే, ఇవేవీ కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. వారం రోజులు గడిచినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. శుక్రవారం ‘డియర్ కామ్రేడ్’ విడుదలైంది కాబట్టి ఆ ప్రభావం ‘ఇస్మార్ట్ శంకర్’పై పడొచ్చు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణలో ఏడు రోజుల్లో రూ.26.13 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ‘ఇస్మార్ట్ శంకర్’ షేర్ లెక్కలు ఇలా ఉన్నాయి.. నైజాం - రూ. 11.60 కోట్లు సీడెడ్ - రూ.4.50 కోట్లు నెల్లూరు - రూ.90 లక్షలు గుంటూరు - రూ.1.62 కోట్లు కృష్ణా - రూ.1.59 కోట్లు పశ్చిమ గోదావరి - రూ.1.33 కోట్లు తూర్పు గోదావరి - రూ.1.61 కోట్లు ఉత్తరాంధ్ర - రూ.2.98 కోట్లు 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఇస్మార్ట్ శంకర్’ షేర్ - రూ.29.13 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YksaIb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...