Sunday 27 February 2022

భీమ్లా నాయక్ వసూళ్ల సునామీ.. పవన్ క్రేజ్ అంటే ఇదే మరి!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు దేశ విదేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు చూశాం. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం నీరాజనం పలుకుతున్నారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత జనంతో థియేటర్స్‌లో జాతర వాతావరణం తీసుకొచ్చాడు భీమ్లా నాయక్. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో భారీగా వసూళ్లు నమోదవుతున్నాయి. క్లాస్, మాస్ సెంటర్స్ లా.. లా.. భీమ్లా సౌండ్‌తో మారు మోగుతున్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు సినిమాకు భారీ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో భీమ్లా నాయక్ హవా నడుస్తోంది. విడుదలకు ఒకరోజు ముందే అనగా ఫిబ్ర‌వ‌రి 24నే యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. ప్రీమియ‌ర్ షోస్ ద్వారానే 875,292 డాల‌ర్స్‌ రాబట్టిన భీమ్లా నాయక్ అదే హంగామా కంటిన్యూ చేస్తున్నాడు. యూఎస్ మార్కెట్‌లో తొలి రోజుకు గాను 450,368 డాలర్స్ రాబట్టిన భీమ్లా నాయక్ మూవీ.. రెండు రోజుకు వచ్చేసరికి 470,128 డాలర్స్, మూడో రోజుకు గాను సుమారు 175,150 డాలర్స్ వసూలు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ మూడు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది భీమ్లా నాయక్ మూవీ. మరోవైపు నైజాం ఏరియాలో భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది. ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్నితెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. చిత్రంలో రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/adjYwC7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...