Thursday 30 December 2021

Year Ender 2021: టాలీవుడ్‌ని హీటెక్కించిన వివాదాలు.. జనాల్లో హాట్ ఇష్యూ అయిన టాపిక్స్ ఇవే..

2020లో కరోనా అంటూ ఓ మహమ్మారి వైరస్ భారతదేశంలోకి ప్రవేశించి 2021లో కూడా ప్రజలందరినీ భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కరోనా దెబ్బకు అతలాకుతలమైంది. అయినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా షూట్స్ కంప్లీట్ చేస్తూ ఎలాగోలా ఈ ఏడాది కొన్ని బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో నెలకొన్న కొన్ని ఇబ్బందులు, వివాదాలు, కొంతమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అవేంటో ఓ సారి చూద్దామా.. వకీల్ సాబ్ ఎంట్రీ- ఏపీ ప్రభుత్వ తీరు రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన అనంతరం 2021- ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' సినిమాతో తిరిగి వెండితెరపై అలరించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఈ చిత్ర బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడమే గాక, టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని లేకుండా చేయడంతో వివాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ వకీల్‌ సాబ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా? అని కామెంట్ చేయడం చర్చల్లో నిలిచింది. అయితే అప్పుడు నెలకొన్న ఈ టికెట్స్ ఇష్యూ నేటికీ సద్దుమణగక పోవడం గమనార్హం. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కి గురి కావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ప్రమాద ఘటన టాలీవుడ్ లోకంలో ఆందోళన నింపింది. బైక్ యాక్సిడెంట్ జరిగిన విధానం, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లడం, నెల రోజుల వరకు ఆయన కోలుకోలేక పోవడం లాంటి పరిణామాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సాయి ధరమ్‌ తేజ్‌ నడిపిన స్పోర్ట్స్ బైక్ వివరాలు, యాక్సిడెంట్ స్పాట్‌లో రోడ్డు ఎలా ఉందనే విషయాలు చర్చల్లోకి వచ్చాయి. వివాదాస్పదం అయిన 'మా' ఎన్నికలు ఎప్పటిలాగే ఈ సారి 'మా' ఎన్నికలు ఇండస్ట్రీ వాతావరణాన్ని వేడెక్కించాయి. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య జరిగిన పోరు యుద్ధ వాతావరణాన్ని తలపెట్టింది. ఈ పోటీలో ఒక వర్గంపై మరో వర్గం చేసుకున్న ఆరోపణలు, వాదోపవాదాలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల అధికారి ప్రవర్తన, హేమ హంగామా, మోహన్‌ బాబు వ్యవహారశైలి ఇలా ప్రతి ఒక్క అంశం హాట్ టాపిక్ అయింది. చివరకు మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. సమంత డివోర్స్ ఇష్యూ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత ఆ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ లోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడిచింది. సమంతపై రకరకాల పుకార్లు షికారు చేయడం, దీనిపై సమంత కోర్టుకెక్కడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో చై- సామ్ విడాకుల వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్ అయింది. సమంత ఐటెం సాంగ్ ఇష్యూ ఇకపోతే విడాకుల అనంతరం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టిన సమంత.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. తొలిసారి ఐటెం సాంగ్ చేసిన ఈ బ్యూటీ 'ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ' అంటూ హుషారెత్తించింది. అయితే ఈ పాటలో వాడిన పదాలు, సాహిత్యం మగవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పురుష సంఘం ఫైర్ అయింది. మరోవైపు ఈ పాట స్పూఫ్ వీడియోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అలా సమంత సాంగ్ జనాల్లో చర్చల్లో నిలిచింది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో సినిమా టికెట్ల రగడ కొనసాగుతోంది. ఈ ఇష్యూపై తన శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్‌కి ముందు రియాక్ట్ అయిన నాని.. ''థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణాకొట్టు కలెక్షన్స్ బటర్‌గా ఉన్నాయి'' అని కామెంట్ చేయడంతో దుమారం రేగింది. పలువురు రాజకీయ నాయకులు నాని మాటలపై ఫైర్ అయ్యారు. దీంతో సినీ ఇండీస్ట్రీ Vs వైసీపీ గవర్నమెంట్ అన్నట్లుగా మారిన ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/348C5t3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...