Tuesday, 19 October 2021

Sarkaru Vaari Paata: విదేశాల్లో మహేష్ బాబు.. యంగ్ హీరోయిన్‌తో ఆడిపాడుతున్న సూపర్ స్టార్

యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో సూపర్ స్టార్ డ్యూయెట్స్ వేసుకుంటున్నారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఈ ఇద్దరిపై సాంగ్ షూట్ చేస్తోంది టీమ్. ఫస్ట్‌ షెడ్యూల్‌ దుబాయ్‌, సెకండ్‌ షెడ్యుల్‌ హైదరాబాద్‌‌లో పూర్తి చేసి ఇప్పుడు స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్‌లో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. అనంతరం అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. పరశురామ్ దర్శకత్వంలో భారీ హంగులతో ఈ 'సర్కారు వారి పాట' మూవీ రూపొందుతోంది. చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరి లుక్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ఇప్పటిదాకా చూడని సరికొత్త కథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 శాతం పూర్తయినట్లు సమాచారం. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతున్నారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్న మహేష్ బాబుకు ఈ మూవీ అతిపెద్ద విజయాన్ని అందిస్తుందని బలంగా నాముతున్నారు ఆయన ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FUhDdI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...