Tuesday, 19 October 2021

Prabhas - Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ ఎప్పుడంటే... ఫ్యాన్స్‌కు పండగే!

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ అనే ప్రేమ క‌థా చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఎపిక్ ల‌వ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాతలు ప్ర‌క‌టించారు. అయితే అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఆరోజున ఏదైనా రాధేశ్యామ్‌కు సంబంధించిన సాలిడ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఫ్యాన్స్ కోరిక నేర‌వేరింది. ఫ్యాన్స్ సహా అందరూ అనుకున్నట్లు పుట్టినరోజు అక్టోబర్ 23న ఉదయం 11 గంటల 16 నిమిషాలకు ‘’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్‌, ప్రేర‌ణ‌గా ఎలా మెస్మ‌రైజ్ చేస్తారోన‌ని ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ గ్లింప్స్, ఓ వీడియో ప్రోమోను మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు యు.వి.క్రియేష‌న్స్ రిలీజ్ చేసింది. ‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూడు వంద‌ల కోట్ల‌పైగా భారీ బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణను ఎప్పుడో పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఒక‌వైపు ‘స‌లార్‌, మ‌రోవైపు ఆదిపురుష్’ సినిమాల‌ను పూర్తి చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఆ వెంటనే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ‘ప్రాజెక్ట్ కె’.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శ‌క‌త్వంలో త‌న మైల్‌స్టోన్ మూవీ...25వ చిత్రం ‘స్పిరిట్‌’ చిత్రాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు ప్ర‌భాస్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lYOOFg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...