Tuesday, 19 October 2021

నీ జీవితానికి నువ్వే యజమాని.. ఇతరుల ఆధిపత్యం ఎందుకు? రష్మిక మందన షాకింగ్ పోస్ట్

'ఛలో' అంటూ తెలుగు తెరపైకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది కన్నడ భామ . కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను పలకరిస్తున్న ఈ చిన్నది.. తాజాగా వేదాంతం వల్లిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నీ జీవితానికి నువ్వే యజమాని అని పేర్కొంటూ ఇందులో చాలా విషయాలు ప్రస్తావించింది. దీంతో ఉన్నట్టుండి రష్మిక ఈ పోస్ట్ ఎందుకు చేసింది? అని జనాల్లో చర్చ మొదలైంది. నీలో దాగి ఉన్న ప్రతిభను నువ్వు గుర్తించగలిగితే జీవితంలో ఇంకాస్త ముందుకు వెళ్లొచ్చు అంటూ రష్మిక పోస్ట్ పెట్టింది. ''ఓ మనిషిగా మనం లోపాలతో జన్మించి ఉండొచ్చు. అభద్రతాభావాల మధ్య జీవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రపంచం నువ్వు ఏం చేయగలవని అనుకుంటుందో దానికన్నా ఎక్కువగానే సాధించగలవని తెలుసుకునే సమయం వస్తుంది. అది గ్రహించినప్పుడు నువ్వు తిరుగులేని వాడవవుతావు. నీ జీవితంలో ఇతరుల ఆధిపత్యం ఉండకుండా చూసుకుంటూ నీ స్వశక్తిని నమ్ముకోవాలి. నీ జీవితానికి, నీ భావోద్వేగాలకు నువ్వే యజమానివి అనేది ఫైనల్. జీవితంలో విలువైన వారి కోసమే వీటిని కేటాయించండి. చాలా తెలివిగా వ్యవహరించండి'' అని రష్మిక తెలిపింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ 'ఎస్.. కరెక్ట్' అని చెబుతూనే రష్మిక పోస్ట్ వెనుక రీజన్ ఏమై ఉంటుందనే అన్వేషణలో పడ్డారు. ఎక్కడైనా నొచ్చుకొని ఉంటుందా? లేక గత జ్ఞాపకాలు తలచుకొని ఇలా పోస్ట్ పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నటుల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచిన రష్మిక.. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన '' మూవీ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పల్లెటూరు యువతిగా రష్మిక రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YYAHqh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...