Thursday 30 September 2021

ఆ విషయంలో చిన్న క్లాష్.. ధనుష్ అడిగిదానికి ఓకే చెప్పలేకపోతున్న శేఖర్ కమ్ముల!

కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఎలాంటి పాత్ర అయినా సరై.. తన అద్భుతమైన నటనతో దాన్ని ఓ రేంజ్‌కు తీసుకువెళ్తారు ఆయన. ఇక ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో.. ఇక్కడ కూడా ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్.. త్వరలో నేరుగా తెలుగు సినిమా చేయనున్నారు. అది దర్శకత్వంలో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. రీసెంట్‌గానే ‘లవ్‌స్టోరి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ధనుష్, శేఖర్ కమ్ముల మధ్య చిన్న క్లాష్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ధనుష్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు అన్ని తమిళ నేటివిటికి తగ్గటుగా ఉంటాయి. సినిమాలో ఆయన వేషధారణ, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా అన్నిటిలో అక్కడి ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం అలా కాదు. ఆయన సినిమాల్లో హీరోల పాత్ర చాలా భిన్నంగా, సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన తన హీరోలను చాలా క్లాస్‌గా చూపిస్తారు. పెద్దగా ఫైట్స్ ఉండవు, మాస్ సన్నివేశాలు ఉండవు, చాలా సాఫ్ట్‌గా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అలాంటి పాత్రనే ధనుష్ కోసం కూడా డిజైన్ చేశారట శేఖర్ కమ్ముల. కానీ, దీంతో ధనుష్ విబేధిస్తున్నారట. తమిళ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఆయన పాత్రను డిజైన్ చేయాలని ధనుష్ కోరారట. దీంతో శేఖర్ కమ్ముల ధనుష్ అడిగిన దానికి ఓకే చెప్పలేక, నో చెప్పలేక మదనపడుతున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు తమ నిర్ణయం మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omTh5X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...