Thursday 30 September 2021

పోసాని దంపతులపై బండ బూతులు.. దొరికితే చంపేస్తాం అంటూ బెదిరింపులు.. కీలక విషయాలు చెప్పిన వాచ్‌మెన్

సినీ రచయిత, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు పోసాని. దీంతో క్రమంగా ఈ ఇష్యూ వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. తన భార్యాపిల్లలను లాగుతూ పవన్ ఫ్యాన్స్ ఇష్టారీతిలో కామెంట్స్ చేస్తున్నారని పోసాని ఆరోపిస్తున్న తరుణంలో ఆయన ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పోసాని దంపతులను బండ బూతులు తిడుతూ పోసాని ఇంటి పరిసరాల్లో తిరిగారు. ఈ విషయాన్ని పోసాని ఉంటున్న ఇంటి వాచ్‌మెన్ చెప్పారు. వారిని చూసి భయంతో తాము బయటకు రాలేదని వాచ్‌మెన్ తెలిపారు. పోసాని కృష్ణమురళి ఇంట్లో గత పదేళ్లుగా పని చేస్తున్నామని, అయితే పోసాని దంపతులు గత 8 నెలలుగా ఇక్కడ ఉండటం లేదని వాచ్‌మెన్ చెప్పారు. తాము తెలిసిన వాళ్ళం కావడంతో ఇల్లు ఈ అప్పజెప్పి వాళ్ళు వేరే చోట ఉంటున్నారని, అప్పటినుంచి తామే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. ఏనాడు ఏ భయం లేదు గానీ మొన్న రాత్రి కొందరు వ్యక్తులు పోసానిని బూతులు తిట్టుకుంటూ వెళ్లారని, నిన్న రాత్రి రాళ్ళ దాడికి పాల్పడటంతో కొడతారేమో అని భయమేసి తాము ఇంట్లో నుంచి బయటకు రాలేదని అన్నారు. పోసాని ఎక్కడ దొరికినా కొడతాం, చంపేస్తాం అంటూ గట్టిగా అరిచారని, భార్యాభర్తలిద్దరినీ పచ్చి బూతులు తిట్టారని వాచ్‌మెన్ మీడియాతో చెప్పారు. నైట్ మొత్తం బండ్లపై అటూఇటూ తిరుగుతూ దాడికి పాల్పడరని అన్నారు. కాగా ఓ ఏడెనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9cohb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...